‘వాల్మీకి’ రిలీజ్‌ డేట్‌ ఫిక్స్‌!

Varun Tej Valmiki Movie Release Date Fix - Sakshi

కెరీర్ ప్రారంభం నుంచి వైవిధ్యమైన  చిత్రాల్లో న‌టించ‌డానికి ఆస‌క్తి చూపిస్తున్న మెగా ప్రిన్స్ వ‌రుణ్ తేజ్‌. ముకుంద‌, కంచె, అంత‌రిక్ష్యం, ఫిదా, తొలి ప్రేమ‌, ఎఫ్‌2 వంటి చిత్రాల‌తో తెలుగు ప్రేక్షకుల హృద‌యాల్లో త‌న‌కంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని ఏర్పరుచుకున్నాడు. అలాగే హీరో బాడీ లాంగ్వేజ్‌ను స‌రికొత్తగా ప్రెజెంట్ చేస్తూ సినిమాను క‌మ‌ర్షియ‌ల్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా తెర‌కెక్కించ‌డంలో డైరెక్టర్ హ‌రీష్ శంక‌ర్‌ దిట్ట. వైవిధ్యమైన చిత్రాల్లో న‌టించడానికి ఆస‌క్తి చూపే వ‌రుణ్ తేజ్‌, ఇండ‌స్ట్రీ హిట్ డైరెక్టర్‌ హ‌రీష్ శంక‌ర్ క‌ల‌యిక‌లో రూపొందుతోన్న చిత్రం `వాల్మీకి`. ఇప్పటికే విడుదలైన ఫస్ట్‌ లుక్‌, టీజర్‌లు సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి.
 
14 రీల్స్ ప్లస్ బ్యాన‌ర్‌పై రామ్ ఆచంట‌, గోపి ఆచంట ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. వ‌రుణ్ తేజ్ గ్యాంగ్‌స్టర్‌ పాత్రలో న‌టిస్తుండ‌గా.. త‌మిళ హీరో అధ‌ర్వ ముర‌ళి కీల‌క పాత్ర పోషిస్తున్నారు. పూజా హెగ్డే, మృణాళిని ర‌వి హీరోయిన్స్‌గా న‌టిస్తున్నారు. ప్రస్తుతం సినిమా షూటింగ్ శ‌ర‌వేగంగా జ‌రుగుతుంది. అన్ని కార్యక్రమాల‌ను పూర్తి చేసి సినిమాను సెప్టెంబ‌ర్ 13న విడుద‌ల చేయ‌డానికి సన్నాహాలు చేస్తున్నారు. తొలుత  ఈ చిత్రాన్ని సెప్టెంబర్‌ 6న విడుదల చేయాలని భావించినా.. ఆగస్టు 30 న సాహో ఉండటంతో కాస్త వెనక్కి తగ్గినట్టు తెలుస్తోంది. ఇక మిక్కి జె.మేయ‌ర్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రానికి ఐనాంక బోస్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. 

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Taboola - Feed

Back to Top