వానవిల్లు సాంగ్ లాంచ్ చేసిన స్టార్ డైరెక్టర్ | Vaana villu song Launch By Surender Reddy | Sakshi
Sakshi News home page

వానవిల్లు సాంగ్ లాంచ్ చేసిన స్టార్ డైరెక్టర్

Jul 13 2017 1:29 PM | Updated on Sep 5 2017 3:57 PM

వానవిల్లు సాంగ్ లాంచ్ చేసిన స్టార్ డైరెక్టర్

వానవిల్లు సాంగ్ లాంచ్ చేసిన స్టార్ డైరెక్టర్

ప్రతీక్ ప్రేమ్ కరణ్ హీరోగా నటిస్తూ, దర్శకత్వం వహిస్తున్న సినిమా 'వానవిల్లు'. శ్రావ్య, శ్రీ సయ్యిని హీరోయిన్లు

ప్రతీక్ ప్రేమ్ కరణ్ హీరోగా నటిస్తూ, దర్శకత్వం వహిస్తున్న సినిమా 'వానవిల్లు'. శ్రావ్య, శ్రీ సయ్యిని హీరోయిన్లు. రాహుల్ మూవీ మేకర్స్ పతాకంపై లంకా కరుణాకర్ దాస్ నిర్మిస్తున్న ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది.  ఈ సినిమాలోని డ్యూయెట్ సాంగ్ని ప్రముఖ దర్శకుడు సురేందర్ రెడ్డి విడుదల చేశారు.

ఈ సందర్భంగా నిర్మాత లంకా కరుణాకర్ దాస్ మాట్లాడుతూ - 'టైటిల్‌కి తగ్గట్టు ఓ అందమైన వెరైటీ ప్రేమకథ ఇది. అందులో వర్షం ఏం చేసింది? అనేది ఆసక్తికరం. కేరళ, మలేసియాలలో కొంత టాకీ, సాంగ్స్ షూట్ చేశాం. స్టైలిష్ డైరెక్టర్ సురేందర్ రెడ్డి గారు మా సినిమాలోని పాటను విడుదల చేయడంతోపాటు.. టేకింగ్ చాలా రిచ్గా ఉందంటూ మెచ్చుకోవడం మాకు సంతోషాన్నిచ్చింది. త్వరలోనే ఆడియో విడుదల చేసి.. అనంతరం సినిమా విడుదలకు సన్నాహాలు చేస్తాం' అన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement