ఎన్‌కౌంటర్‌పై ఉపేంద్ర వ్యాఖ్యలు.. నెటిజన్ల ఫైర్

దిశ నిందితుల ఎన్‌కౌంటర్‌పై ప్రముఖ నటుడు, ఉత్తమ ప్రజాకీయ పార్టీ రాష్ట్రాధ్యక్షుడు ఉపేంద్ర చేసిన ట్వీట్ దుమారం రేపుతోంది. ఈ ఎన్‌కౌంటర్‌పై ఉపేంద్ర ట్విటర్‌లో చేసిన పోస్ట్‌పై నెటిజన్లు మండిపడుతున్నారు. నిందితుల ఎన్‌కౌంటర్‌పై ఉపేంద్ర స్పందిస్తూ.. ఆ నలుగురే దిశపై అత్యాచారం చేసి కాల్చి చంపారా అని ప్రశ్నించారు. ప్రముఖుల విషయంలో ఈ రకమైన ఎన్‌కౌంటర్‌లు ఎందుకు జరగడం లేదని నిలదీశారు. కోర్టు విచారణ పూర్తి కాకపోముందే నిందితులను ఎన్‌కౌంటర్ చేయడం సరికాదన్నారు. ఒకప్పుడు ఎన్‌కౌంటర్‌ల ద్వారా రౌడీయిజం తగ్గిపోయిందని అని అన్నారు. నిజాయితీ కలిగిన అధికారులు దృష్టిపెడితే ఎన్‌కౌంటర్‌ల ద్వారా మహిళలపై అత్యాచారాలను నివారించవచ్చని అభిప్రాయపడ్డారు. కానీ ధనవంతులు, ప్రముఖులు దీనిని దుర్వినియోగం చేయకుండా చూడాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు.
అయితే ఉపేంద్ర ట్వీట్‌కు కొందరు మద్దతు తెలుపుతుండగా, చాలా మంది ఆయన మాటలను ఖండిస్తూ కామెంట్లు పెడుతున్నారు. ఓ రాజకీయ నటుడిగా, స్టార్ హీరోగా ఉపేంద్ర ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సరికాదని మెజారిటీ నెటిజన్లు తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. కాగా, దిశ అత్యాచారం, హత్య కేసులో నలుగురు నిందితులు ఎన్‌కౌంటర్‌లో మృతిచెందిన సంగతి తెలిసిందే.
*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి