ఉపేంద్ర కథానాయకునిగా ‘మినిమమ్ గ్యారెంటీ’ శ్రీనివాస్ దర్శకత్వంలో కన్నడంలో రూపొందిన చిత్రం ‘టోపీవాలా’.
ఉపేంద్ర కథానాయకునిగా ‘మినిమమ్ గ్యారెంటీ’ శ్రీనివాస్ దర్శకత్వంలో కన్నడంలో రూపొందిన చిత్రం ‘టోపీవాలా’. ఇందులో భావన కథానాయిక. ఈ సినిమాను ‘స్విస్‌బ్యాంక్‌కి దారేది’ పేరుతో తెలుగులోకి అనువదించారు రమేష్‌బాబు ఆవులూరి. ‘ది జర్నీ ఆఫ్ టోపీవాలా’ అనేది ఉపశీర్షిక. వి.హరికృష్ణ స్వరాలందించిన ఈ చిత్రం పాటలను హైదరాబాద్‌లో ఇటీవల విడుదల చేశారు. శివాజీ, కృష్ణుడు, టి.ప్రసన్నకుమార్, కె.అశోక్‌కుమార్, తుమ్మలపల్లి రామసత్యనారాయణ, బెక్కెం వేణుగోపాల్, మామిడిశెట్టి శ్రీనివాస్ తదితరులు ఈ కార్యక్రమానికి హాజరై సినిమా విజయం సాధించాలని ఆకాంక్షించారు. ఆడియో వేడుకకు విచ్చేసిన అందరికీ నిర్మాత కృతజ్ఞతలు తెలిపారు. ఈ చిత్రానికి సమర్పణ: ఎస్.ఎన్.పగడాల, నిర్మాణ నిర్వాహకులు: ఆవులూరి వెంకయ్యనాయుడు, కె.పూర్ణచంద్రరావు.