తిరి చిత్రానికి యూ సర్టిఫికెట్ | u Certificate to tiri movie | Sakshi
Sakshi News home page

తిరి చిత్రానికి యూ సర్టిఫికెట్

Dec 9 2016 1:49 AM | Updated on Sep 4 2017 10:14 PM

తిరి చిత్రానికి యూ సర్టిఫికెట్

తిరి చిత్రానికి యూ సర్టిఫికెట్

తిరి చిత్రానికి సెన్సార్ బోర్డు యూ సర్టిఫికెట్ అందించడంతో చిత్ర యూనిట్ సంతోషాన్ని వ్యక్తం చేసింది.

తిరి చిత్రానికి సెన్సార్ బోర్డు యూ సర్టిఫికెట్ అందించడంతో చిత్ర యూనిట్ సంతోషాన్ని వ్యక్తం చేసింది. నవ దర్శకుడు అశోక్ తెరకెక్కించిన చిత్రం తిరి. అశ్విన్ కాక్కమను హీరోగా నటించిన ఇందులో నటి స్వాతిరెడ్డి హీరోరుున్‌గా నటించారు. సీషోర్ గోల్డ్ ప్రొడక్షన్‌‌స పతాకంపై ఏకే.బాలమురుగన్, ఆర్‌పీ.బాలగోపి సంయు క్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి ఎం.వెట్రికుమార్, ఎస్.ఆంటోన్ రంజిత్, ఎస్.జాన్ పీటర్ సహ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు.

చిత్రం వివరాలను దర్శకుడు తెలుపుతూ తిరి చిత్రం నిర్మాణ కార్యక్రమాలను పూర్తి చేసుకుందని, త్వరలోనే విడుదలకు సన్నాహాలు చేస్తున్నట్లు వెల్లడించారు. ఈ రోజుల్లో ఒక జనరంజకమైన కుటుంబ సమేతంగా చూడదగ్గ చిత్రానికి యూ సర్టిఫికెట్ లభించడం కష్ట సాధ్యంగా మారిందనే చెప్పాలన్నారు.అలాంటిది తమ తిరి చిత్రానికి యూ సర్టిఫికెట్ లభించడం చాలా సంతోషంగా ఉందన్నారు. ఇది తండ్రి కొడుకుల మధ్య సాగే విభిన్న కథా చిత్రం అని తెలిపారు. తిరి చిత్రం ప్రేక్షకుల ఆదరణ పొందుతుందనే నమ్మకం తమకు ఉందని దర్శకుడు అశోక్ అన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement