ట్వంటీఫస్ట్‌న ఏంటి? | twenty first movie audio release | Sakshi
Sakshi News home page

ట్వంటీఫస్ట్‌న ఏంటి?

Nov 2 2015 11:31 PM | Updated on Sep 3 2017 11:54 AM

ట్వంటీఫస్ట్‌న ఏంటి?

ట్వంటీఫస్ట్‌న ఏంటి?

హారర్ థ్రిల్లర్ నేపథ్యంలో వైవిధ్యమైన కథాంశంతో రూపొందిన చిత్రం ‘ట్వంటీఫస్ట్’.

హారర్ థ్రిల్లర్ నేపథ్యంలో వైవిధ్యమైన కథాంశంతో రూపొందిన  చిత్రం ‘ట్వంటీఫస్ట్’. వెంకట్, వింధ్య, నవీన్ ముఖ్య పాత్రల్లో జయశంకర్  దర్శకత్వంలో యాదగిరి నిర్మిస్తున్నారు. అభిషేక్  స్వరాలందించిన  ఈ చిత్రం పాటలను దర్శకుడు ఎన్.శంకర్ హైదరాబాద్‌లో విడుదల చేసి దర్శకుడు రఫీకి అందజేశారు. దర్శకుడు మాట్లాడుతూ- ‘‘ఆద్యంతం ఉత్కంఠభరితంగా ఈ చిత్రం సాగుతుంది. అసలు ట్వంటీఫస్ట్ అనే టైటిల్ ఈ సినిమాకు బాగా సరిపోతుంది. ఇటీవలే సెన్సార్ పూర్తయింది. త్వరలో ఈ చిత్రాన్ని విడుదల చేస్తాం’’ అని చెప్పారు.

Advertisement
 
Advertisement
Advertisement