టీఎస్‌ఎఫ్‌సీసీ అధ్యక్షుడిగా కె. మురళీమోహన్‌ | TSFCC President k Murali Mohan | Sakshi
Sakshi News home page

టీఎస్‌ఎఫ్‌సీసీ అధ్యక్షుడిగా కె. మురళీమోహన్‌

Jun 25 2017 1:06 AM | Updated on Sep 5 2017 2:22 PM

టీఎస్‌ఎఫ్‌సీసీ అధ్యక్షుడిగా కె. మురళీమోహన్‌

టీఎస్‌ఎఫ్‌సీసీ అధ్యక్షుడిగా కె. మురళీమోహన్‌

తెలంగాణ స్టేట్‌ ఫిల్మ్‌ ఛాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ (టీఎస్‌ఎఫ్‌సీసీ) నూతన అధ్యక్షుడిగా కె. మురళీమోహన్, ఉపాధ్యక్షులుగా వీయల్‌ మల్లి ఖార్జున్‌ గౌడ్,

తెలంగాణ స్టేట్‌ ఫిల్మ్‌ ఛాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ (టీఎస్‌ఎఫ్‌సీసీ) నూతన అధ్యక్షుడిగా కె. మురళీమోహన్, ఉపాధ్యక్షులుగా వీయల్‌ మల్లి ఖార్జున్‌ గౌడ్, వీయల్‌ శ్రీధర్, జాయింట్‌ సెక్రటరీగా బాలగోవింద రాజ్‌ తాడ్లలు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఇతర పదవులకు జరిగిన ఎన్నికల్లో ప్రధాన కార్యదర్శిగా సునీల్‌ నారంగ్‌ అత్యధిక మెజారిటీతో విజయం సాధించగా, కోశాధికారిగా ఏజే ఇన్నారెడ్డి, ఇతర కార్యవర్గ సభ్యులుగా జె. చంద్రశేఖర్‌రావు, వి. నాగేశ్వరరావు, పి. శ్రీనివాసరావు (వాసు), ఎమ్‌. మోహన్‌కుమార్, దిలీప్‌కుమార్‌ టాండన్, ఎ. సుధాకర్‌రెడ్డి, జి. శ్రీనివాస్, పి. సుబ్రమణ్యం, జివీవీ ప్రసాద్‌రావు, పి. అశోక్‌ రావు ఎన్నికయ్యారు. ‘‘టీఎస్‌ఎఫ్‌సీసీ తరపున చిన్న సినిమాలకు తోడ్పాటు అందిస్తామని, చిత్ర పరిశ్రమ అభివృద్ధికి పాటు పడతాం’’ అన్నారు కె. మురళీ మోహన్, సునీల్‌ నారంగ్‌. రెండేళ్ల పాటు నూతన కమిటీ కొనసాగుతుంది.

Advertisement

Related News By Category

Advertisement
 
Advertisement

పోల్

Advertisement