ఆశపడ్డా కానీ...

Trisha Worried About Jayalalithaa Biopic Missing - Sakshi

సినిమా: ఆశ పడ్డాను కానీ..అంటోంది చెన్నై చిన్నది త్రిష. జీవితంలో అప్‌ అండ్‌ డౌన్‌ అన్నది ప్రతి వ్యక్తికి సహజంగా జరిగేదే. అదేవిధంగా ఆశ పడినవన్నీ దరిచేరవు కూడా. ఇందుకు నటి త్రిష అతీతం కాదు. అయితే జరిగేవన్నీ మన మంచికేనని జీవితాన్ని ఎంజాయ్‌ చేసే వ్యక్తిత్వం కలిగిన ఈ ముద్దుగుమ్మ తను ఆ మధ్య పెళ్లి వరకూ వచ్చి ఆగిపోయిన తన ప్రేమ వ్యవహారం గురించి లైట్‌గా తీసుకుని నటిగా కొనసాగుతోంది. ఇక ఈ మధ్య సరైన సక్సెస్‌లు కూడా లేకపోవడంతో మార్కెట్‌ కూడా కాస్త డల్‌ అయ్యింది. అలాంటి సమయంలోనే సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌తో నటించాలన్న తన చిరకాల ఆశ నెరవేరే అవకాశం పేట చిత్రంతో వచ్చింది. దీంతో త్రిష ఆనందానికి అవధుల్లేక పోతున్నాయి.

మరో విషయం ఏమిటంటే విజయ్‌సేతుపతితో ఈ అమ్మడు నటించిన 96 చిత్రం గురువారం తెరపైకి రానుంది. ఈ చిత్రంపైనా మంచి అంచనాలు ఉన్నాయి. దీంతో త్రిష చాలా ఉత్సాహంగా ఉంది. ఎంతగా అంటే సెకెండ్‌ ఇన్నింగ్స్‌ మొదలెట్టేశానని నమ్మకంతో చెప్పేంతగా. ఈ అమ్మడు ఇటీవల ఒక భేటీలో తన భావాలను పంచుకుంటూ రజనీకాంత్, విజయ్‌సేతుపతిలతో నటించాలన్న కోరిక నెరవేరిందని చెప్పింది.అంతే కాదు మరో రౌండ్‌కు నేనూ రెడీ అయ్యాను అంది. రజనీకాంత్‌తో నటిస్తున్న పేట చిత్రం కోసం  తన బరువు, జుత్తు పొడవు తగ్గించుకున్నానని చెప్పింది. ఒక రజనీకాంత్‌ గురించి చెప్పాలంటే సూపర్‌స్టార్‌ అన్న ఎలాంటి అహం లేకుండా చాలా  నిరాడంబరంగా, అత్యంత సహజంగా నడుచుకుంటారని తెలిపింది. మీతో నటించడం నా డ్రీమ్‌ అని చెప్పగా ఆయన చిన్న దరహాసం చేశారని చెప్పింది. ఇకపోతే చాలా మంది అడుగుతున్న ప్రశ్న పెళ్లెప్పుడు అని, అయితే ప్రస్తుతానికి పెళ్లి గురించి ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని చెప్పింది. అదే  విధంగా ఎవరినీ ప్రేమించడం లేదని అంది. బాయ్‌ఫ్రెండ్‌ కూడా లేడని చెప్పింది. తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత పాత్రలో నటించాలని ఆశ పడ్డానని, అయితే ఆ అవకాశం వేరెవరికో దక్కిందని చెబుతున్నారని అంది. అందువల్ల తనకెలాంటి బాధ లేదని త్రిష పేర్కొంది.

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top