అచ్చిరాని హర్రర్‌

Trisha Disappointed With Horror Movies - Sakshi

తమిళసినిమా: కోలీవుడ్‌లో హర్రర్‌ చిత్రాల ట్రెండ్‌ కొనసాగుతూనే ఉంది. నిర్మాతలకు మంచి లాభదాయకంగా ఉండడమే అందుకు కారణం కావచ్చు. అంతే కాదు అగ్రనటిగా రాణిస్తున్న నయనతారకు హర్రర్‌ ట్రెండీ వర్కౌట్‌ అయ్యింది. మాయ చిత్రం ఆమె కెరీర్‌కు మంచి హెల్ప్‌ అయ్యిందని చెప్పక తప్పదు. అయితే అదే బాటలో పయనించాలని భావించిన నటి త్రిషకు వర్కౌట్‌ కాలేదు. కమర్శియల్‌ చిత్రాల నాయకిగా వెలుగుతున్న త్రిష. నాయకి చిత్రంలో హీరోయిన్‌ సెంట్రిక్‌ చిత్రాల నాయకిగా రాణించాలని ఆశ పడింది. అయితే అది మొదట్లోనే గండి పడింది. తమిళం, తెలుగు భాషల్లో తెరకెక్కిన ఆ చిత్రం అట్టర్‌ ఫ్లాప్‌ అయ్యింది. అయినా మరో ప్రయత్నం చేద్దామని చేసిన మోహిని చిత్రం త్రిషను పూర్తిగా నిరాశ పరచింది. ఇందులో తను తొలిసారిగా  ద్విపాత్రాభినయం చేసింది కూడా. ఈ చిత్ర విడుదలకు ముందు పత్రికల వారితో తనకు హర్రర్‌ చిత్రాలంటే ఇష్టం అని, అదీ దెయ్యాలంటే నమ్మకం ఉందని చెప్పుకొచ్చింది.

అంతేకాదు ఇకపై కూడా హర్రర్‌ కథా చిత్రాలు చేస్తానని పేర్కొంది. అలాంటిది ఇప్పుడు చాలా స్ట్రాంగ్‌ డెసిషన్‌ తీసుకుందట. అదేమై ఉంటుందో ఊహించగలరా?  నాయకి, మోహిని చిత్రాలు ఘోరంగా నిరాశపరచడంతో ఇకపై ఇలాంటి హర్రర్‌ కథా చిత్రాలను చేయనన్నదే ఆ నిర్ణయం. అంతే కాదు మోహినీ చిత్ర దెబ్బకు త్రిష వారం రోజుల పాటు ఏకాంతం కోరుకుంది. తన చిత్రాలకు సంబంధించిన అన్ని పనులకు దూరంగా ఉంటుందట అవును ఈ విషయాన్ని ఒక వీడియో ద్వారా పేర్కొని దాన్ని తన ఇన్‌స్ట్రాగామ్‌లో పోస్ట్‌ చేసింది. కొత్త చిత్ర కథా చర్చలపై ప్రత్యేక దృష్టి సారించడానికే ఈ విరామం తీసుకున్నట్లు అందులో పేర్కొంది. ఈ అమ్మడి చేతిలో విజయ్‌సేతుపతితో నటిస్తున్న 96, లేడీ ఓరియెంటెడ్‌ కథా చిత్రంగా తెరకెక్కుతున్న గర్జన, 1818, అరవిందస్వామి సరసన నటిస్తున్న చతురంగవేట్టై 2 చిత్రాలు ఉన్నాయి. అయితే ఇవన్నీ షూటింగ్, నిర్మాణాంతర కార్యక్రమాలు చివరి దశకు చేరుకున్నాయన్నది గమనార్హం. ప్రస్తుతం ఫ్లాప్‌ల్లో ఉన్న త్రిషకు నిర్మాణంలో ఉన్న ఏ చిత్రం విజయానందాన్ని ఇస్తుందో చూడాలి.

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top