మమ్మల్ని కించపరుస్తారా? | Transgenders Protest At Telugu Film Chamber | Sakshi
Sakshi News home page

ఫిల్మ్‌చాంబర్‌ వద్ద హిజ్రాల ఆందోళన

Aug 28 2018 6:15 PM | Updated on Aug 28 2018 6:52 PM

Transgenders Protest At Telugu Film Chamber - Sakshi

@నర్తనశాల మూవీలో నాగశౌర్య, శివాజీ రాజా

‘@నర్తనశాల’ మూవీలో హిజ్రాలను కించపరిచే సన్నివేశాలు ఉన్నాయని చిత్ర విడుదలను నిలిపేయాలని..

సాక్షి, హైదరాబాద్: కొంత మంది హిజ్రాలు మంగళవారం తెలుగు ఫిల్మ్‌చాంబర్‌ వద్ద ఆందోళన చేపట్టారు. నాగశౌర్య కథానాయకుడిగా తెరకెక్కిన ‘@నర్తనశాల’ మూవీలో హిజ్రాలను కించపరిచే సన్నివేశాలు ఉన్నాయని ఆరోపించారు. తమకు వ్యతిరేకంగా చిత్రికరించిన సన్నివేశాలను తొలిగించాలని లేకుంటే చిత్ర విడుదలను అడ్డుకుంటామని హెచ్చరించారు.

ఈ నెల 30న విడుదల కానున్న ‘నర్తనశాల’లో కశ్మీరా పరదేశి, యామినీ భాస్కర్‌ హీరోయిన్లుగా నటించారు. శ్రీనివాస చక్రవర్తి దర్శకత్వంలో శంకర ప్రసాద్‌ ముల్పూరి సమర్పణలో ఉషా ముల్పూరి ఈ మూవీని నిర్మించారు. చిత్ర యూనిట్‌ రిలీజ్‌ చేసిన టీజర్‌లో నాగశౌర్య ‘గే’ లా నటించిన సీన్స్‌.. అతనికి తండ్రి పాత్ర పోషించిన శివాజీ రాజా ‘నా కొడుకు గే నా’ అని చెప్పిన డైలాగ్స్‌పై హిజ్రాలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. 

సముదాయించిన శివాజీరాజా
హిజ్రాల ఆందోళనపై శివాజీరాజా స్పందించారు. తన చాంబర్ లోకి పిలిపించుకొని హిజ్రాలను సముదాయించారు. హిజ్రాల కోసం ప్రత్యేకంగా నర్తనశాల ప్రదర్శన వేయిస్తానని హామీయిచ్చారు. అభ్యంతరకర సన్నివేశాలు, దృశ్యాలను తొలగించేందుకు నిర్మాతలతో చర్చిస్తానని తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement