స్క్రీన్‌ టెస్ట్‌

tollywood movies special screen test - Sakshi

1. ప్రస్తుతం ప్రభాస్‌ నటిస్తున్న చిత్రం ‘సాహో’. ఈ యంగ్‌ రెబల్‌స్టార్‌కి హీరోగా ‘సాహో’ ఎన్నో సినిమానో తెలుసా?
ఎ) 19  బి) 23  సి) 25  డి)16

2. సంజయ్‌దత్‌ జీవితం ఆధారంగా తెరకెక్కిన చిత్రం ‘సంజు’. సంజు తల్లి ‘నర్గీస్‌దత్‌’ పాత్రలో నటించిన హీరోయిన్‌ ఎవరో తెలుసా?
ఎ) సోనమ్‌ కపూర్‌  బి) అనుష్కా శర్మ   సి) విద్యాబాలన్‌   డి) మనీషా కోయిరాల

3. ‘కేరళ బ్లాస్టర్స్‌’ అనే ఫుట్‌బాల్‌ టీమ్‌ ఓనర్స్‌లో ఈ హీరో  వన్నాఫ్‌ ది పార్టనర్స్‌. ఎవరా టాప్‌ హీరో కనుక్కోగలరా?
ఎ) చిరంజీవి  బి) వెంకటేశ్‌   సి) రజనీకాంత్‌  డి) కమల్‌ హాసన్‌

4. చిరంజీవి చిన్న అల్లుడు కల్యాణ్‌దేవ్‌ నటించిన చిత్రం ‘విజేత’. ఆ చిత్రదర్శకుడెవరో తెలుసా?
ఎ) అజయ్‌ భూపతి బి) రాకేశ్‌ శశి   సి) రాహుల్‌ రవీంద్రన్‌   డి) ఇంద్రసేన .ఆర్‌

5. వైవీయస్‌ చౌదరి దర్శకత్వంలో రామ్, ఇలియానా జంటగా వచ్చిన ‘దేవదాసు’ గుర్తుండే ఉంటుంది. అందులో స్పెషల్‌ క్యారెక్టర్‌లో నటించిన ప్రముఖ హీరోయిన్‌ ఎవరో తెలుసా?
ఎ) సమీరా రెడ్డి    బి) త్రిష   సి) శ్రియా శరన్‌   డి) జెనీలియా

6. అల్లు అర్జున్‌ నటించిన ‘సరైనోడు’ సినిమాలో ఇద్దరు హీరోయిన్లు. అందులో ఒకరు క్యాథరిన్‌ థెరిస్సా. మరొక హీరోయిన్‌ ఎవరో కనుక్కోండి?
ఎ) పూజా హెగ్డే     బి) రకుల్‌ప్రీత్‌ సింగ్‌   సి) కియారా అద్వాని   డి) అమలా పాల్‌

7. వీవీ వినాయక్‌ ఏ హీరోతో సినిమా చేయటం ద్వారా దర్శకుడిగా పరిచయం అయ్యారో గుర్తుందా?
ఎ) రామ్‌చరణ్‌   బి) రవితేజ   సి) ప్రభాస్‌         డి) ఎన్టీఆర్‌

8. ‘టెంపర్‌’ చిత్రంలో   ఎన్టీఆర్‌సరసన నటించిన  హీరోయిన్‌ ఎవరో చెప్పుకోండి?
ఎ) ఇలియానా   బి) కాజల్‌ అగర్వాల్‌   సి) తమన్నా  డి) నివేథా థామస్‌

9. ‘చుక్కలు తెమ్మన్నా తెంచుకురానా’ అనే పాట ‘ఏప్రిల్‌ 1 విడుదల’ సినిమా లోనిది. ఆ పాట రచయితెవరో తెలుసా?
ఎ) వేటూరి సుందరామ్మూర్తి   బి) ‘సిరివెన్నెల’ సీతారామశాస్త్రి   సి) వంశీ   డి) వనమాలి

10. ‘వెల్‌కమ్‌ టూ న్యూయార్క్‌’ అనే హిందీ చిత్రంలో గెస్ట్‌ పాత్రలో కనిపించిన టాలీవుడ్‌ నటుడెవరో తెలుసా?
ఎ) నానీ      బి) రామ్‌   సి) రానా    డి) అఖిల్‌

11. 2010లో హీరోయిన్‌గా తెలుగు, తమిళ భాషల్లో కథానాయికగా ఎంట్రీ ఇచ్చింది. తెలుగులో హీరోయిన్‌గా 20 చిత్రాల్లో నటించిన ఆ హీరోయిన్‌ ఎవరో కనిపెట్టండి?
ఎ) తాప్సీ           బి) అంజలి    సి) శ్రుతీహాసన్‌   డి) సమంత

12. ‘రాజీ’  చిత్రం ద్వారా మంచి పేరుతో పాటు హీరోయిన్‌గా మంచి ఇమేజ్‌ను సొంతం చేసుకున్న బాలీవుడ్‌ భామ ఎవరో తెలుసా?
ఎ) కంగనా రనౌత్‌    బి) ఆలియా భట్‌   సి) కరీనా కపూర్‌  డి) సోనాక్షీ సిన్హా

13. ‘హలో గురూ ప్రేమకోసమే రా జీవితం’ అనే పాటలో నాగార్జునతో కలిసి స్టెప్పులేసిన హీరోయిన్‌ ఎవరో తెలుసా?
ఎ) అమల   బి) రమ్యకృష్ణ   సి) మీనా    డి) టబు

14. ‘నీవెవరో’ అనే చిత్రంలో అంధునిగా నటిస్తున్న నటుడెవరో కనుక్కోండి?
ఎ) నవీన్‌ చంద్ర   బి) రాజ్‌ తరుణ్‌   సి) ఆది పినిశెట్టి   డి) ఆది సాయికుమార్‌

15. ‘వచ్చిండే పిల్లా మెల్లగ వచ్చిండే.. క్రీము బిస్కట్‌ వేసిండే’     అనే పాట పాడిన గాయని ఎవరో తెలుసా?
ఎ) స్మిత           బి) అంజనా సౌమ్య   సి) చిన్మయి     డి) మధుప్రియ  

16. 1971లో రిలీజైన ‘ప్రేమనగర్‌’ చిత్రంలో హీరో అక్కినేని. ఆయన తండ్రి పాత్రలో నటించిన నటుడెవరో గుర్తు తెచ్చుకోండి?
ఎ) ప్రభాకర్‌ రెడ్డి     బి) గుమ్మడి   సి) సత్యనారాయణ   డి) యస్వీ రంగారావు

17. రజనీకాంత్‌ ‘2.0’లో హీరోయిన్‌గా నటిస్తున్న నటి ఎవరు?
ఎ) ఆండ్రియా  బి) ఐశ్వర్యా రాయ్‌  సి) అమీ జాక్సన్‌   డి) దీపికా పదుకోన్‌

18. ‘వెన్నెల’ చిత్రం ద్వారా దర్శకునిగా మారిన ఎన్నారై ఎవరో చెప్పుకోండి?
ఎ) శేఖర్‌ కమ్ముల   బి) దేవా కట్టా   సి) ప్రవీణ్‌ సత్తార్‌   డి) సాయికిరణ్‌ అడివి

19. ఈ ఫొటోలోని చిన్న పాప ఇప్పుడు ప్రముఖ బాలీవుడ్‌ హీరోయిన్‌. ఆమె ఎవరో కనుక్కోండి?
ఎ) ఆలియా భట్‌ బి) సోనాక్షీ సిన్హా   సి) కత్రినా కైఫ్‌    డి) శ్రద్ధాకపూర్‌

20. సుజాత, ఎన్టీఆర్, మురళీమోహన్‌ నటించిన ఏ సినిమాలోని స్టిల్‌ ఇది.. కనిపెట్టండి?
ఎ) మహాపురుషుడు   బి) యుగపురుషుడు   సి) డ్రైవర్‌ రాముడు   డి) అడవి రాముడు

మీరు 6 సమాధానాల కంటే తక్కువ చెబితే... మీకు సినిమా అంటే ఇష్టం     
10 సమాధానాల వరకూ చెప్పగలిగితే...   మీకు సినిమా అంటే ఇంట్రెస్ట్‌
15 సమాధానాల వరకూ చెప్పగలిగితే... మీకు సినిమా అంటే పిచ్చి
20 సమాధానాలూ చెప్పగలిగితే...  ఇంకోసారి ఈ క్విజ్‌ చదవకండి!

సమాధానాలు
1) ఎ 2) డి 3) ఎ 4) బి 5) సి 6) బి 7) డి 8) బి  9) బి 10) సి 11) డి
12) బి 13) ఎ 14) సి  15) డి 16) డి 17) సి 18) బి 19) బి 20) ఎ

నిర్వహణ: శివ మల్లాల

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter


Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top