జూన్ 21న టాలీవుడ్, కోలీవుడ్ క్రికెట్ మ్యాచ్ | tollywood, kollywood stars cricket match on june 21 | Sakshi
Sakshi News home page

జూన్ 21న టాలీవుడ్, కోలీవుడ్ క్రికెట్ మ్యాచ్

Apr 30 2015 5:54 PM | Updated on Sep 3 2017 1:10 AM

తెలుగు, తమిళ సినీతారలతో క్రికెట్ మ్యాచ్ నిర్వహించనున్నట్టు తెలంగాణ ఫిలిం ఛాంబర్ ప్రతినిధులు తెలిపారు.

హైదరాబాద్: తెలుగు, తమిళ సినీతారలతో క్రికెట్ మ్యాచ్ నిర్వహించనున్నట్టు తెలంగాణ ఫిలిం ఛాంబర్ ప్రతినిధులు తెలిపారు. జూన్ 21న టాలీవుడ్, కోలీవుడ్ నటులతో ఎల్బీ స్టేడియంలో క్రికెట్ మ్యాచ్ నిర్వహిస్తామని చెప్పారు. తెలంగాణ ఫిలిం ఛాంబర్ ప్రతినిధులు గురువారం ముఖ్యమంత్రి కేసీఆర్ ను కలిశారు.

అనంతరం వారు విలేకరులతో మాట్లాడుతూ... మ్యాచ్ నిర్వహణతో వచ్చిన ఆదాయాన్ని సీఎం సహాయ నిధికి అందిస్తామని వెల్లడించారు. సినీ నటుల క్రికెట్ మ్యాచ్ కు సీఎం కేసీఆర్ హాజరవుతారని తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement