దేవుడే మళ్లీ ఆహ్వానించాడు! | tolikiranam movie is a devotional moive | Sakshi
Sakshi News home page

దేవుడే మళ్లీ ఆహ్వానించాడు!

Nov 18 2016 10:58 PM | Updated on Sep 4 2017 8:27 PM

దేవుడే మళ్లీ ఆహ్వానించాడు!

దేవుడే మళ్లీ ఆహ్వానించాడు!

‘‘బైబిల్ కథాంశంతో తెరకెక్కనున్న చిత్రమిది. సమాజానికి మంచి మెసేజ్ ఇచ్చే చిత్రం అవుతుందనుకుంటున్నా.

‘‘బైబిల్ కథాంశంతో తెరకెక్కనున్న చిత్రమిది. సమాజానికి మంచి మెసేజ్ ఇచ్చే చిత్రం అవుతుందనుకుంటున్నా. ‘కరుణామయుడు’ రేంజ్‌లో ఈ చిత్రం ఆడాలి’’ అని నటుడు, ఎమ్మెల్యే బాబూమోహన్ అన్నారు. సీనియర్ నటి దివ్యవాణి ప్రధానపాత్రలో ‘తొలి కిరణం’ జాన్‌బాబు దర్శకత్వంలో డి.శ్రీధర్‌రెడ్డి నిర్మిస్తున్న ‘నీ దేవుడే నా దేవుడు’ చిత్రం ఇటీవల ప్రారంభమైంది.

‘‘చారిత్రక చిత్రమిది. క్రీస్తు పూర్వం ఇజ్రాయిల్ దేశంలో జరిగిన అత్తాకోడళ్ల కథ’’ అని దర్శకుడు అన్నారు. ‘‘పదిహేనేళ్ల వయసు నుంచి సినిమాల్లో నటిస్తున్న నేను పెళ్లయ్యాక ఏడేళ్లు గ్యాప్ తీసుకున్నా. నాకిష్టమైన ఈ రంగానికి దేవుడు నన్ను మళ్లీ ఆహ్వానించాడు. నయోని అనే పాత్రలో కనిపిస్తా’’ అని దివ్యవాణి  చెప్పారు. ఈ చిత్రానికి సమర్పణ: స్రవంతి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement