భారత రాష్ట్రపతి ఎవరు?.. చాలా కష్టం!

Tiger Shroff Trolled with President Of India Video - Sakshi

సాక్షి, ముంబై : నటన సంగతి ఏమోగానీ.. సినిమా వాళ్లకి బయటి విషయాల్లో పరిజ్ఞానం కాస్త తక్కువేనని అలియా భట్‌ లాంటి వాళ్లు తరచూ నిరూపిస్తుంటారు. తాజాగా ఈ లిస్ట్‌లో ఇప్పుడు యంగ్‌ హీరో టైగర్‌ ష్రాఫ్‌ కూడా చేరిపోయాడు. 

టైగర్‌ నటించిన భాఘీ-2 రిలీజ్‌ అయ్యి హిట్‌ టాక్‌తో దూసుకుపోతోంది. ఈ క్రమంలో ఏబీపీ న్యూస్‌ ఇంటర్వ్యూకు గర్ల్‌ ఫ్రెండ్‌, ఈ చిత్ర హీరోయిన్‌ దిశా పఠానీతో టైగర్‌ హాజరయ్యాడు. వ్యక్తిగత విషయాల తర్వాత యాంకర్‌.. భారతదేశానికి రాష్ట్రపతి ఎవరు? అని టైగర్‌ను ప్రశ్నించింది. 

‘ఇది చాలా కష్టతరమైన ప్రశ్న’... అంటూ తటపటాయించిన టైగర్‌ ‘మిస్టర్‌ ముఖర్జీ(ప్రణబ్‌ ముఖర్జీ)’...  అని పేర్కొన్నాడు. ఆ సమాధానానికి కంగుతిన్న యాంకర్‌.. మైక్‌ను దిశపఠానీ ముందు ఉంచేసరికి  ఆవిడ ‘రామ్‌ నాథ్‌ కోవింద్‌’ అని చెప్పేసింది. కెరీర్‌ తొలినాటి నుంచి టైగర్‌ ష్రాఫ్‌ను ట్రోల్‌ చేస్తున్న వాళ్లకు ఈ వీడియో దొరికితే ఊరుకుంటారా? ఇప్పుడు చెలరేగిపోతున్నారు.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top