తొలి కిరణ సంగీతం | tholi kiranam in new telugu flim | Sakshi
Sakshi News home page

తొలి కిరణ సంగీతం

Mar 26 2016 10:37 PM | Updated on Aug 13 2018 4:03 PM

తొలి కిరణ సంగీతం - Sakshi

తొలి కిరణ సంగీతం

ఏసుక్రీస్తు జీవితం మళ్లీ తెర మీదకు రావడానికి సిద్ధమవుతోంది.

 ఏసుక్రీస్తు జీవితం మళ్లీ తెర మీదకు రావడానికి సిద్ధమవుతోంది. పీడి రాజు ప్రధాన పాత్రలో సువర్ణ క్రియేషన్స్ పతాకంపై జె.జాన్‌బాబు దర్శకత్వంలో టి.సుధాకర్ నిర్మించిన చిత్రం ‘తొలి కిరణం’. ఆర్ .పి.పట్నాయక్ స్వరపరిచిన ఈ చిత్రం పాటలను ఏప్రిల్ 11న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.

దర్శకుడు మాట్లాడుతూ- ‘‘ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసుకుని ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుపుకొంటోంది. ఈ వేడుక కు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు ముఖ్య అతిథిగా విచ్చేసి ఈ చిత్రం పాటలను ఆవిష్కరించనున్నారు. ఈ చిత్రాన్ని తెలుగుతో పాటు తమిళ, మలయాళ భాషల్లో కూడా నిర్మించాం. వేసవి కానుకగా  ఈ చిత్రాన్ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం’’ అని తెలిపారు. ఈ చిత్రానికి కథ-మాటలు: టి.ప్రభుకిరణ్, ఎడిటింగ్: వినయ్.

Advertisement
 
Advertisement
Advertisement