ఛలో దుబాయ్‌! | This unit will go to Dubai to take several key scenes in 'Sahoo'. | Sakshi
Sakshi News home page

ఛలో దుబాయ్‌!

Jun 23 2017 11:27 PM | Updated on Jul 17 2019 10:14 AM

ఛలో దుబాయ్‌! - Sakshi

ఛలో దుబాయ్‌!

‘బాహుబలి’ హ్యాంగోవర్‌ నుంచి ప్రభాస్‌ బయటికొచ్చేశారు. ప్రస్తుతం చేస్తున్న ‘సాహో’లో పూర్తిగా లీనమైపోయారు.

‘బాహుబలి’ హ్యాంగోవర్‌ నుంచి ప్రభాస్‌ బయటికొచ్చేశారు. ప్రస్తుతం చేస్తున్న ‘సాహో’లో పూర్తిగా లీనమైపోయారు. సుజీత్‌ దర్శకత్వంలో రూపొందుతోన్న ఈ చిత్రం షూటింగ్‌ ఇటీవల ప్రారంభమైంది. హైదరాబాద్‌ పరిసర ప్రాంతాల్లో కొన్ని కీలక సన్నివేశాలు తీశారు. మరో షెడ్యూల్‌ కోసం ఈ యూనిట్‌ దుబాయ్‌ వెళ్లనుందట.

ప్రపంచంలో అత్యంత ఎల్తైన భవనం అయిన అక్కడి బుర్జ్‌ ఖలీఫా పరిసర ప్రాంతాల్లో ప్రభాస్, విలన్‌ నీల్‌ నితిన్‌ముఖేష్‌లపై హాలీవుడ్‌ లెవల్‌లో యాక్షన్‌ సీన్స్‌ తీయనున్నారని సమాచారం. ఇంకా పలు కీలక సన్నివేశాలను తీయడానికి కూడా ప్లాన్‌ చేశారట. యూవీ క్రియేషన్స్‌ పతాకంపై వంశీ, ప్రమోద్‌ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇదిలా ఉంటే.. ఈ చిత్రానికి ఇంకా కథానాయిక ఫైనలైజ్‌ కాలేదు. టాలీవుడ్‌ తారలతో పాటు పలువురు బాలీవుడ్‌ నాయికల పేర్లను పరిశీలిస్తున్నారని భోగట్టా.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement