మనుషులను ప్రేమించే దెయ్యం | The songs of 'Naku Manasunnadhi' are released in Hyderabad | Sakshi
Sakshi News home page

మనుషులను ప్రేమించే దెయ్యం

Aug 21 2017 12:31 AM | Updated on Sep 17 2017 5:45 PM

మనుషులను ప్రేమించే దెయ్యం

మనుషులను ప్రేమించే దెయ్యం

సుజయ్, తనిష్క, చంద్రకాంత్, రష్మీ, సోని ముఖ్యతారలుగా రాజశేఖర్‌ దర్శకత్వంలో దేవశంకర్‌ గౌడ్‌ నిర్మింంచిన సినిమా ‘నాకూ మనసున్నది’.

సుజయ్, తనిష్క, చంద్రకాంత్, రష్మీ, సోని ముఖ్యతారలుగా రాజశేఖర్‌ దర్శకత్వంలో దేవశంకర్‌ గౌడ్‌ నిర్మింంచిన సినిమా ‘నాకూ మనసున్నది’. ఉదయ్‌కిరణ్‌ స్వరపరచిన ఈ సినిమా పాటలను హైదరాబాద్‌లో విడుదల చేశారు. తెలంగాణ ఫిలించాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ అధ్యక్షుడు ప్రతాని రామకృష్ణ గౌడ్‌ మాట్లాడుతూ– ‘‘పాటలు వినసొంపుగా ఉన్నాయి. ఈ సిన్మా విజయవంతమై నిర్మాతకు లాభాలు రావాలని కోరుకుంటున్నా’’ అన్నారు. ‘‘దెయ్యం మనుషుల్ని ప్రేమించడమనేది కొత్త కాన్సెప్ట్‌. ట్రైలర్‌ బాగుంది’’ అన్నారు సాయి వెంకట్‌. నటి కవిత, నటుడు బానుచందర్, నిర్మాత టి. రామసత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. ఈ చిత్రానికి కెమెరా: పెద్దాడ వెంకట రమణ.

Advertisement
 
Advertisement
Advertisement