
యోగా చేస్తున్న తమన్నా
మనసు ప్రశాంతంగా ఉంటే మంచి ఆలోచనలు వస్తాయి. మంచి ఆలోచనల వల్ల జీవితంలో సమస్యలు తగ్గతాయి. ఇలామనసును ప్రశాంతంగా ఉంచుకునేందుకు ఒక్కొక్కరూ ఒక్కో మార్గాన్ని ఎంచుకుంటారు. కొందరు ఉదయాన్నే యోగా చేస్తారు. మరికొందరు వాకింగ్ ఎంచుకుంటారు. తమన్నా యోగా చేసేవారి కోవలోకి వస్తారు.
తాను యోగా చేస్తున్న ఫొటోలను ట్వీటర్‌లో షేర్ చేశారామె. ‘‘ప్రతిరోజూ ఓ కొత్తరోజు. లైఫ్‌లో నిన్ను నువ్వు డెవలప్ చేసుకునే ప్రోగ్రెస్ ఎవ్రీడే ప్రాసెస్‌లో ఉండాలి. ఇలా జరగాలంటే మైండ్ అండ్ శరీరాన్ని బ్యాలెన్స్ చేయాలి. ఇందుకు యోగాను మించింది లేదు. శారీరకంగా, మానసికంగా యోగా బెస్ట్’’ అని పేర్కొన్నారు తమన్నా.