తాగుబోతు రమేశ్ హీరోగా... | Thagubothu RGV Movie Logo Launch | Sakshi
Sakshi News home page

తాగుబోతు రమేశ్ హీరోగా...

Jan 30 2015 11:18 PM | Updated on Sep 2 2017 8:32 PM

తాగుబోతు రమేశ్ హీరోగా...

తాగుబోతు రమేశ్ హీరోగా...

తాగుబోతు పాత్రలకు చిరునామా అనిపించుకున్న తాగుబోతు రమేశ్ హీరోగా నటిస్తున్న చిత్రం ‘తాగుబోతు ఆర్జీవీ’.

తాగుబోతు పాత్రలకు చిరునామా అనిపించుకున్న తాగుబోతు రమేశ్ హీరోగా నటిస్తున్న చిత్రం ‘తాగుబోతు ఆర్జీవీ’. రమేశ్ సరసన మేఘనా పటేల్ కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రాన్ని తెలుగు, కన్నడ భాషల్లో త్రిశూల్ దర్శకత్వంలో ఎన్.ఎం. కాంతారావు నిర్మిస్తున్నారు. ఈ చిత్రం టైటిల్, బ్రోచర్ ఆవిష్కరణ కార్యక్రమం హైదరాబాద్‌లో జరిగింది. ఈ సందర్భంగా తాగుబోతు రమేశ్ మాట్లాడుతూ - ‘‘తాగుబోతు పాత్రల ద్వారా పేరు తెచ్చుకున్న నేను ‘ఏకే రావు పీకే రావు’ చిత్రంలో లీడ్ రోల్ చేశాను.

ఇప్పుడు రెండు భాషల్లో రూపొందుతున్న ఈ చిత్రంలో లీడ్ రోల్ చేయడం ఆనందంగా ఉంది’’ అన్నారు. కన్నడంలో రెండు చిత్రాలకు దర్శకత్వం వహించాననీ, తెలుగులో ఇది తొలి చిత్రమని దర్శకుడు తెలిపారు. కథ నచ్చి, ఈ చిత్రం నిర్మిస్తున్నానని ఎన్.ఎం. కాంతారావు తెలిపారు. అలీ, పృధ్వీ, పోసాని, రఘుబాబు తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: ఓంకార్ త్యాగరాజ్, పాటలు: భాస్కరభట్ల, కెమెరా: సినీటెక్ సూరి, ఎడిటింగ్: నాగేంద్ర.

Advertisement
 
Advertisement
Advertisement