ఒకే ఒక ఆశతో... | telugu new movie | Sakshi
Sakshi News home page

ఒకే ఒక ఆశ

Mar 25 2016 11:53 PM | Updated on Sep 3 2017 8:34 PM

ఒకే ఒక ఆశతో...

ఒకే ఒక ఆశతో...

అందరూ కొత్తవారితో తీసిన ‘ఒకే ఒక ఆశ’ చిత్రం విజయవంతం కావాలని సీనియర్ నటి కవిత అభిలషించారు. తరుణ్ తేజ, శరత్ అలి, శ్రీలేఖ,


 అందరూ కొత్తవారితో తీసిన ‘ఒకే ఒక ఆశ’ చిత్రం విజయవంతం కావాలని సీనియర్ నటి కవిత అభిలషించారు. తరుణ్ తేజ, శరత్ అలి, శ్రీలేఖ, హరిత ముఖ్యపాత్రల్లో శ్రీలత నాయుడు సమర్పణలో సర్వోదయ మూవీస్ పతాకంపై పరాంకుశం రవి కుమార్ దర్శకత్వంలో జాని, చిన్నయ్య దొర నిర్మించిన చిత్రం ‘ఒకే ఒక ఆశ’. ఈ సినిమా పాటల సీడీని కవిత విడుదల చేశారు. ‘‘ఈ చిత్రానికి నేనే పాటలు స్వరపరిచాను. ఏప్రిల్ మొదటివారంలో సినిమాను విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నాం’’ అని దర్శకుడు తెలిపారు. కెమేరా మ్యాన్ ఎస్ రైసాబ్, సహ నిర్మాతలు పి.పద్మజ, పి. శ్రీలత నాయుడు తదితరులు ఈ వేడుకలో పాల్గొన్నారు.
 

Advertisement
 
Advertisement
Advertisement