
సాక్షి, హైదరాబాద్: మ్యూజికల్ హిట్స్‌గా నిలిచిన ఎన్నో చిత్రాలకు గేయ రచయితగా పనిచేసిన శివగణేష్ గుండెపోటుతో మరణించారు. గురువారం వనస్థలిపురంలోని ఆయన స్వగృహంలో తుదిశ్వాస విడిచారు. తెలుగులో డబ్బింగ్ చిత్రాలుగా రిలీజ్ అయి ఘనవిజయం సాధించిన ప్రేమికుల రోజు, నర్సింహా, జీన్స్, ఒకే ఒక్కడు, బాయ్స్, ఎంతవారు కాని, 7జీ బృందావన్ కాలనీ లాంటి సినిమాలకు ఆయన సాహిత్యమందించారు. వెయ్యికిపైగా చిత్రాలకు ఆయన పాటలు రాశారు. శివగణేష్‌కు భార్య నాగేంద్రమణి శివగణేష్, కుమారులు సుహాస్, మానస్‌లు ఉన్నారు. ఆయన మృతికి పలువురు తెలుగు, తమిళ సినిమా రంగ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు.