
రాశిఖన్నా బర్త్ డే పార్టీలో హీరోల సందడి
హీరోయిన్ రాశిఖన్నా పుట్టినరోజు పార్టీలో తారలు సందడి చేశారు.
హైదరాబాద్: హీరోయిన్ రాశిఖన్నా పుట్టినరోజు పార్టీలో తారలు సందడి చేశారు. సోమవారం ఆమె జన్మదినాన్ని పురస్కరించుకుని సహచర నటీనటులతో కలిసి ఆమె పార్టీ చేసుకుంది. హీరోలు రవితేజ, రామ్, అల్లు శిరీష్, సాయి ధర్మతేజ, వరుణ్ తేజ్, సందీప్ కిషన్, హీరోయిన్ రకుల్ ప్రీత్ పార్టీకి హాజరయ్యారు. రాశి ఖన్నాకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. వారంతా కలిసి సెల్ఫీ తీసుకున్నారు. దీన్ని రకుల్ ప్రీత్ తన ట్విటర్ లో పోస్ట్ చేసింది.
అంతేకాదు తనకెంతో ఇష్టమైన రాశిఖన్నాకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపింది. ఆమె కెరీర్ లో ఈ ఏడాది సూపర్ హిట్ గా నిలవాలని ఆకాంక్షించింది. ఆమె ఎప్పుడూ ఆనందంగా ఉండాలని కోరుకుంది. హీరోయిన్ తమన్నా కూడా ట్విటర్ ద్వారా రాశిఖన్నాకు బర్త్ డే విషెష్ చెప్పింది. ఆమె కెరీర్ ఉజ్వలంగా సాగాలని ఆకాంక్షించింది.
ఊహలు గుసగుసలాడే సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన రాశి ఖన్నా ప్రస్తుతం 'బైంగాల్ టైగర్'లో రవితేజ సరసన, 'సుప్రీం'లో సాయి ధర్మతేజకు జోడీగా నటిస్తోంది.
Happppy budday to d most adorable, my love @raashikhanna .. Have a superhit year! N may U alwaysss keep smiling! Muah
— Rakul Preet (@Rakulpreet) November 30, 2015