ఎవరా ‘చీప్‌ స్టార్‌’..?

Telugu Director Ajay Bhupathi Cheap Star Tweet Goes Viral - Sakshi

తొలి సినిమాతోనే సెన్సేషన్‌ సృష్టించి యువ దర్శకుడు అజయ్‌ భూపతి. రామ్‌గోపాల్‌ వర్మ శిష్యుడిగా ఇండస్ట్రీకి పరిచయం అయిన అజయ్‌ భూపతి, తొలి సినిమా ఆర్‌ఎక్స్‌ 100తోనే తన మార్క్‌ చూపించాడు. ఈ సినిమా హీరో కార్తికేయ, హీరోయిన్ పాయల్‌ రాజ్‌పుత్‌లతో పాటు దర్శకుడిగా అజయ్‌కి కూడా మంచి పేరు తీసుకువచ్చింది.

అయితే తొలి సినిమా ఘన విజయం సాధించినా అజయ్ రెండో సినిమా ఇంతవరకు ప్రారంభం కాలేదు. మహా సముద్రం అనే కథను సిద్ధం చేసుకున్న అజయ్‌ ఆ కథ కోసం హీరోలను వెతికే పనిలో ఉన్నాడు. ముందుగా బెల్లంకొండ సాయి శ్రీనివాస్‌ హీరోగా ఈ ప్రాజెక్ట్ ఉంటుందన్న టాక్‌ వినిపించింది. కానీ తరువాత సీన్‌లోకి సీనియర్‌ హీరోగా రవితేజ వచ్చాడు. రవితేజ కూడా మహా సముద్రం నుంచి తప్పుకున్నట్టుగా ఇటీవల వార్తలు వినిపించాయి.

ఈ సమయంలోనే అజయ్‌ భూపతి ‘చీప్‌ స్టార్‌’ అంటూ ట్వీట్ చేయటంతో ఈ ట్వీట్ వైరల్‌గా మారింది. అజయ్‌ ఎవరి ఉద్దేశించి ఈ ట్వీట్ చేశాడన్న చర్చ జరుగుతోంది. ఇటీవల నాగచైతన్యతో కూడా అజయ్‌ చర్చలు జరిపాడన్న వార్తలు వినిపించాయి. ప్రాజెక్ట్ ఆలస్యమవుతున్న కారణంగానే అజయ్‌ ఇలా స్పందించాడా..? బెల్లంకొండ సాయి శ్రీనివాస్‌, రవితేజ, నాగచైతన్యలలో ఒకరిని ఉద్దేశించే ఇలాంటి ట్వీట్ చేశాడా..? లేక మరెవరినైనా దృష్టిలో పెట్టుకొని చేశాడా..? అన్న విషయం తెలియాలంటే మాత్రం అజయ్‌ క్లారిటీ ఇవ్వాల్సిందే.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top