బిగ్‌బాస్‌ షోలో ఇప్పుడు మీరు కూడా ఆడొచ్చు.. | Telugu Bigg Boss Season 2 Additions Started | Sakshi
Sakshi News home page

బిగ్‌బాస్‌ షోలో ఇప్పుడు మీరు కూడా ఆడొచ్చు..

May 9 2018 6:34 PM | Updated on Jul 18 2019 1:45 PM

Telugu Bigg Boss Season 2 Additions Started - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : గత ఏడాది తెలుగు బుల్లి తెరపై బిగ్‌బాస్‌ రియాల్టీ షో చేసిన హంగామా అంతా ఇంతా కాదు. జూనియర్ ఎన్టీఆర్‌ వ్యాఖ్యాతగా వచ్చిన ఈ షో టీఆర్పీ రేటింగ్‌లను ఓ స్థాయికి తీసుకెళ్లింది. సెలబ్రిటీల ఆటతీరుతో అనుకున్న దానికంటే సూపర్‌ హిట్‌ అయింది. దీంతో నిర్వాహకులు రెండో సీజన్‌కు ప్రణాలికలు వేస్తున్నారు. అయితే ఈ సారి నిర్వాహకులు ఈ కార్యక్రమంలో కొన్ని మార్పులు చేర్పులు చేశారు.

కార్యక్రమాన్ని మరింత ఆకర్షనీయంగా తీర్చిదిద్దడానికి సెలబ్రిటీలతో పాటు సామాన్యులు, సాధారణ ప్రేక్షకులు సైతం ఇందులో పాల్గొనేలా నిర్వాహకులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇందులో భాగంగానే సీజన్‌2కు ఆడిషన్లు మొదలైనట్లు షో నిర్వాహకులు తెలియచేశారు. ఇందులో సామాన్యులు సైతం పాల్గొనే అవకాశం ఉందని తెలుపుతూ ఓ వీడియోను విడుదల చేశారు. గత సీజన్‌లో వైల్డ్‌కార్డు ఎంట్రీ ఇచ్చిన దీక్షాపంత్‌ ఉన్న వీడియోలో బిగ్‌బాస్ షోకి సామాన్యులకు స్వాగతం అంటూ ఓ వాయిస్ వినిపిస్తుంది.

దానికి కొనసాగింపుగా ఇంకో వీడియోను సైతం నిర్వాహకులు విడుదల చేశారు. ఈ వీడియోలో ఇంట్లో ఏపని చేయని ఓ యువకుడు ఉదయాన్నే లేచి అన్నిపనులు చేస్తుంటాడు. అది చూసిన కుటుంబ సభ్యులు తనకు ఏమైందంటూ ఆలోచిస్తుంటారు. అదే సమయంలో బిగ్‌బాస్‌ షోలో సామాన్యులకు అవకాశం అంటూ ఓ ప్రకటన వస్తుంది. అంటే ఇప్పుడు బిగ్‌బాస్ హౌస్‌లో సెలబ్రిటీలతో పాటు సామాన్యులు కూడా సందడి చేయబోతున్నారన్నమాట. మరి ఇంకెందుకు ఆలస్యం మీరు ట్రై చేయండి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement