‘తేజ్‌..’ అందమైన ప్రేమకవితలాంటి సినిమా! | Tej I Love You will be super hit, Says KS Ramarao | Sakshi
Sakshi News home page

Jun 16 2018 12:07 PM | Updated on Jun 16 2018 2:36 PM

Tej I Love You will be super hit, Says KS Ramarao - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : మెగా హీరో సాయి ధరమ్‌ తేజ్‌ హీరోగా తెరకెక్కిన తాజా సినిమా ‘తేజూ.. ఐ లవ్ యూ’. ఈ సినిమా ఆడియో సక్సెస్ మీట్ తాజాగా నగరంలో జరిగింది. ఈ కార్యక్రమంలో చిత్ర నిర్మాత కేఎస్‌ రామారావు, దర్శకుడు కరుణాకరన్, హీరో సాయి ధరమ్  తేజ్, హీరోయిన్‌ అనుపమ పరమేశ్వరన్‌ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేఎస్‌ రామారావు మాట్లాడతూ.. ‘ఈ సినిమా కరుణాకరన్ బ్రాండ్ తగినట్టు ఉంటుంది. అందమయిన లవ్ స్టోరీ తీశాం. అందమయిన ప్రేమకవితలా ఈ సినిమా ఉంటుంది. ఈ సినిమా కచ్చితంగా విజయవంతం అవుతుంది’ అని ధీమా వ్యక్తం చేశారు.

దర్శకుడు కరుణాకరన్ మాట్లాడుతూ..  ‘క్రియేటివ్ కమర్షియల్‌ బ్యానర్‌లో ఇది నా రెండో సినిమా. ఈ సినిమా చాలా బాగా వచ్చింది. ఎగ్జామ్‌ రాసిన స్టూడెంట్‌లా ఈ సినిమా రిజల్ట్‌ కోసం ఎదురుచూస్తున్నా’ అని అన్నారు. హీరో తేజ్ మాట్లాడుతూ ‘ఈ సినిమాకి మంచి మ్యూజిక్ ఇచ్చారు. ఆడియో బాగా సక్సెస్ అయ్యింది’ అని సంతోషం వ్యక్తం చేశారు. జులై 6న ఈ సినిమా విడుదల అవుతుందని తెలిపారు. ఇది క్యూట్‌ సినిమా అని, తన లైఫ్‌లో ఒక మంచి సినిమాగా గుర్తుండిపోతుందని హీరోయిన్‌ అనుపమ పరమేశ్వరన్‌ అన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement