రూ.100 కోట్ల క్లబ్ లో 'ఏబీసీడీ 2' | Team 'ABCD 2' dances away into Rs.10O crore club | Sakshi
Sakshi News home page

రూ.100 కోట్ల క్లబ్ లో 'ఏబీసీడీ 2'

Jul 6 2015 7:23 PM | Updated on Sep 3 2017 5:01 AM

రూ.100 కోట్ల క్లబ్ లో 'ఏబీసీడీ 2'

రూ.100 కోట్ల క్లబ్ లో 'ఏబీసీడీ 2'

వరుణ్ ధావన్, శ్రద్ధాకపూర్ డాన్స్ సినిమా 'ఏబీసీడీ 2' బాక్సాఫీస్ వద్ద వసూళ్ల వరద పారిస్తోంది.

ముంబై: వరుణ్ ధావన్, శ్రద్ధాకపూర్ డాన్స్ సినిమా 'ఏబీసీడీ 2' బాక్సాఫీస్ వద్ద వసూళ్ల వరద పారిస్తోంది. రూ.100 కోట్ల క్లబ్ లో చేరింది. ఈ సినిమా మూడు వారాల్లో రూ.101.91 కోట్లు వసూలు చేసింది. ఈ ఏడాది రూ. 100 కోట్లు కలెక్షన్లు సాధించిన రెండో సినిమాగా నిలిచింది. దీనికంటే ముందు కంగనా రౌనత్ 'తనూ వెడ్స్ మనూ రిటర్న్స్'  వంద కోట్లు వసూళ్లు సాధించింది.

రెమో డిసౌజా దర్శకత్వంలో రూపొందిన 'ఏబీసీడీ 2' జూన్ 19న విడుదలైంది. ఈ సినిమాతో వరుణ్ ధావన్ తొలిసారిగా వంద కోట్ల క్లబ్ లో చేరాడు. శ్రద్ధాకపూర్ రూ.100 కోట్ల క్లబ్ లో చేరడం ఇది రెండోసారి. ఆమె నటించిన 'ఏక్ విలన్' సినిమా రూ.100 కోట్లకు పైగా కలెక్షన్లు రాబట్టింది.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement