రాజ్‌తరుణ్ హుషారు ప్రేమ | Tarun Raj love husaru | Sakshi
Sakshi News home page

రాజ్‌తరుణ్ హుషారు ప్రేమ

Aug 28 2015 11:37 PM | Updated on Sep 3 2017 8:18 AM

రాజ్‌తరుణ్ హుషారు ప్రేమ

రాజ్‌తరుణ్ హుషారు ప్రేమ

సినిమా చూపిస్త మావ’ అంటూ ప్రేక్షకులకు మంచి వినోదాన్ని పంచిన రాజ్‌తరుణ్ ఇప్పుడు తన తాజా చిత్రం షూటింగ్‌లో బిజీగా ఉన్నారు.

‘సినిమా చూపిస్త మావ’ అంటూ ప్రేక్షకులకు మంచి వినోదాన్ని పంచిన రాజ్‌తరుణ్  ఇప్పుడు తన తాజా చిత్రం షూటింగ్‌లో బిజీగా ఉన్నారు. శ్రీ శైలేంద్ర ప్రొడక్షన్స్ పతాకంపై శ్రీనివాస్ గవిరెడ్డి దర్శకత్వంలో ఎస్.శైలేంద్రబాబు, శ్రీధర్‌రెడ్డి కేవి, హరీష్.డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఆర్తన కథానాయిక. నిర్మాత మాట్లాడుతూ- ‘‘ఈ చిత్రంలో రాజ్‌తరుణ్ ఈ తరానికి ప్రతినిధిలా కనిపిస్తాడు. ఆయన పాత్ర చాలా హుషారుగా ఉంటుంది.  ప్రస్తుతం రాజ్‌తరుణ్, ఆర్తనలపై ఓ రొమాంటిక్ సాంగ్ చిత్రీకరిస్తున్నాం’’ అని తెలిపారు. ఈ చిత్రానికి సంగీతం: గోపీ సుందర్, ఛాయాగ్రహణం: విశ్వ, సమర్పణ: శ్రీమతి పూర్ణిమ, ఎస్.బాబు
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement