భల్లాలదేవుడికి ఏమైంది? | 'Taped up my damaged wrist for full blown training soon!!' tweets Rana | Sakshi
Sakshi News home page

భల్లాలదేవుడికి ఏమైంది?

May 26 2016 6:30 PM | Updated on Aug 11 2019 12:52 PM

భల్లాలదేవుడికి ఏమైంది? - Sakshi

భల్లాలదేవుడికి ఏమైంది?

బాహుబలి-2 షూటింగ్ లో రానా స్వల్పంగా గాయపడినట్లు తెలుస్తోంది. మణికట్టుకు బ్యాండెడ్ వేసున్న ఫొటోను రానా తన ట్విట్టర్ అకౌంట్ లో పోస్ట్ చేశారు. దాంతో త్వరగా కోలుకోండంటూ అభిమానుల నుంచి సందేశాలు వెల్లువెత్తుతున్నాయి.

బాహుబలి-2 షూటింగ్ లో రానా స్వల్పంగా గాయపడినట్లు తెలుస్తోంది. మణికట్టుకు బ్యాండేజి వేసున్న ఫొటోను రానా తన ట్విట్టర్ అకౌంట్ లో పోస్ట్ చేశారు. తన మణికట్టుకు గాయమైందని, అందువల్ల ఈ టేప్ వేసుకున్నానని చెప్పాడు. త్వరలోనే మళ్లీ పూర్తిస్థాయి శిక్షణ కోసం ఎదురుచూస్తున్నానన్నాడు. దాంతో త్వరగా కోలుకోండంటూ అభిమానుల నుంచి సందేశాలు వెల్లువెత్తుతున్నాయి. భారీ యాక్షన్ సినిమాల షూటింగుల్లో ఇటువంటి గాయాలు సాధారణమేనంటూ ఇదివరకు గాయాలపాలైనప్పుడు రానా అన్నారు.

కాగా బాహుబలి-2 సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. 2017లో బాహుబలి- 2 సినిమా రిలీజ్ కానున్నప్పటికీ.. రాజమౌళి షూటింగ్ పనుల్ని చకచకా చేసేస్తున్నాడు. రానా, అనుష్క షూటింగ్ లో పాల్గొనాల్సి ఉండగా.. మొత్తం షూటింగ్ అక్టోబర్ వరకు పూర్తవుతుందని అంచనా. 2017 వేసవిలో విడుదల చేసేందుకు చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తుంది.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement