
బాలీవుడ్‌లో ఉన్న అగ్రహీరోల్లో అజయ్ దేవగణ్ ఒకరు. ఎన్నో విభిన్నమైన పాత్రలతో మంచి నటుడిగా గుర్తింపు పొందారాయన. ఈ నెల 2న అజయ్ జన్మదినం. 50వ వసంతంలోకి అడుగు పెట్టారాయన. ప్రొఫెషనల్‌గా కెరీర్‌లో వందో చిత్రం చేస్తున్నారు. ప్రస్తుతం నటిస్తున్న పీరియాడికల్ మూవీ ‘తానాజీ: ది అన్‌సంగ్ వారియర్’ ఆయనకు వందో చిత్రం. ‘‘రేపు ఏమౌతుంది? అనే ఆలోచన లేకుండా ఇండస్ట్రీలో నా కెరీర్‌ను స్టార్ట్ చేశాను. ఇప్పుడు వెనక్కి తిరిగి చూసుకుంటే 28 ఏళ్లు పూర్తయ్యాయి. వందో చిత్రంలో నటిస్తున్నాను. చాలా ఆనందంగా ఉంది’’ అని అజయ్ దేవగణ్ అన్నారు. ఆయన నటించిన ‘టోటల్ ధమాల్, దే దే ప్యార్ దే’ చిత్రాలు త్వరలో విడుదల కానున్నాయి.