అందుకే ఆలస్యమౌతోంది

Tamil Padam as Sudigadu in Telugu - Sakshi

తమిళ సినిమాల మీద సెటైరికల్‌గా వచ్చిన పేరడీ చిత్రం ‘తమిళ పడం’. శివ హీరోగా సి.యస్‌ ఆముదన్‌ రూపొందించారు. తెలుగులో ‘సుడిగాడు’గా ‘అల్లరి’ నరేశ్‌ రీమేక్‌ చేశారు. ఇప్పుడీ సినిమాకు సీక్వెల్‌ ‘తమిళ పడం 2.0’ రూపొందిస్తున్నారు. ఈ సినిమాను మొదట మే 25న రిలీజ్‌ చేద్దాం అనుకున్నారు. అయితే విజువల్‌ ఎఫెక్ట్స్‌ లేట్‌ అవ్వడంతో సినిమా విడుదలను వాయిదా వేశారు. సినిమా ఆలస్యం గురించి చిత్రబృందం మాట్లాడుతూ – ‘‘తమిళ పడం 2.0’లో భారీ గ్రాఫిక్స్‌ వర్క్‌  పని ఉంది. ముఖ్యంగా మా హీరోని కొంచెం అందంగా చూపించడానికి, హీరో కండలు ఇంకా బాగా చూపించడానికి లాస్‌ ఏంజెల్స్‌లో స్టూడియోతో, హీరోయిన్‌ ముడతలు, కళ్ల కింద నల్లటి వలయాలు తీసేయడానికి కాలిఫోర్నియాలో మరో స్టూడియోతో కలసి పని చేస్తున్నాం. ఇంతటి వీయఫ్‌ఎక్స్‌ పనిఉండటంతో రిలీజ్‌ని వాయిదా వేసుకోవాల్సి వచ్చింది. భయపడకండి త్వరలోనే థియేటర్స్‌లోకి వచ్చేస్తాం’’ అని పేర్కొంది.

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top