లిప్‌లాక్‌ వద్దన్న హీరో.. కారణం ఇదేనా! | tamil actor sibiraj say no to liplock scene in satya movie | Sakshi
Sakshi News home page

లిప్‌లాక్‌ వద్దన్న హీరో.. కారణం ఇదేనా!

May 24 2017 6:56 PM | Updated on Sep 5 2017 11:54 AM

లిప్‌లాక్‌ వద్దన్న హీరో.. కారణం ఇదేనా!

లిప్‌లాక్‌ వద్దన్న హీరో.. కారణం ఇదేనా!

సాధారణంగా లిప్‌లాక్‌ సన్నివేశాలకు కథానాయికలు నో చెబుతుంటారు.

చెన్నై: సాధారణంగా లిప్‌లాక్‌ సన్నివేశాలకు కథానాయికలు నో చెబుతుంటారు. అయితే తమిళ నటుడు సిబిరాజ్‌ హీరోయిన్‌తో లిప్‌లాక్‌ సన్నివేశంలో నటించడానికి ససేమిరా అన్నారు. ఆ సంగతేమిటో చూద్దాం. సత్యరాజ్‌ సమర్పణలో ఆయన కొడుకు సిబిరాజ్‌ హీరోగా నటిస్తూ, నాదాంబాళ్‌ ఫిలిం ఫ్యాక్టరీ పతాకంపై నిర్మిస్తున్న చిత్రం సత్య. ప్రదీప్‌ కృష్ణమూర్తి దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీలో నటి రామ్యానంబీశన్‌ హీరోయిన్ గానూ, నటి వరలక్ష్మీ పోలీస్‌ అధికారిగా నటిస్తున్నారు.  555 చిత్రం ఫేమ్‌ సైమన్‌ సంగీతాన్ని అందించారు.

సత్య మూవీ జూన్‌ చివర్లో తెరపైకి రానుంది. ప్రదీప్‌ కృష్ణమూర్తి మాట్లాడుతూ.. గతంలో నటుడు కమలహాసన్‌ నటించిన సత్య చిత్రం ఆయన కేరీర్‌ను ఎలా మలుపు తిప్పిందో, అదే విధంగా నటుడు సిబిరాజ్‌కు ఈ సత్య పెద్ద టర్నింగ్‌ పాయింట్ అవుతుంది. ఇది క్రైమ్‌ థ్రిల్లర్‌ కథా చిత్రం. తెలుగులో విజయం సాధించిన ‘క్షణం’ చిత్రానికి ఇది రీమేక్‌. మూవీ స్టోరీ డిమాండ్‌ మేరకు హీరో హీరోయిన్ల మధ్య లిప్‌లాక్‌ సన్నివేశం ఉంటుంది. అయితే, ఆ సీన్లో నటించాలని ఎంతగా నచ్చజెప్పినా హీరో సిబిరాజ్‌ మాత్రం ఒప్పుకోలేదు. ఈ చిత్రాన్ని తన కూతురు కూడా చూస్తుందనే కారణాన్ని సిబిరాజ్ చెప్పారని' ఈ సందర్భంగా వివరించారు.

Advertisement
 
Advertisement
Advertisement