మళ్లీ నిరాశే!

మళ్లీ నిరాశే!


 ఇటు తెలుగులోనూ, అటు తమిళంలోనూ తమన్నా అంటే గోల్డెన్ లెగ్. ఆమె చేసిన సినిమాలు ఎక్కువ శాతం హిట్లే. కానీ, హిందీ చిత్రసీమలో మాత్రం తమన్నా జాతకం తిరగబడింది. ఎన్నో కలలతో ‘హిమ్మత్‌వాలా’ ద్వారా ఉత్తరాది ప్రేక్షకులకు పరిచయమయ్యారు తమన్నా. అయితే, ఆ సినిమా పరాజయం పాలైంది. ఆ విషయం గురించి తమన్నాను ఎవరడిగినా.. ‘‘దక్షిణాదిన పాతిక సినిమాలకు పైగా చేశాను. జయాపజయాలు నాకు కొత్త కాదు. ఓ సినిమా హిట్ కానంత మాత్రాన నేను హర్ట్ అయిపోను’’ అని ధీమాగా సమాధానం చెప్పారు. హిందీ రంగంలో తన రెండో చిత్రం ‘హమ్‌షకల్స్’పై బోల్డన్ని ఆశలు పెంచుకున్నారు ఈ మిల్క్ బ్యూటీ. ఈ మధ్యకాలంలో ఏ సినిమా ప్రచార కార్యక్రమాల్లోనూ తమన్నా అంత విస్తృతంగా పాల్గొని ఉండరేమో.

 

  ‘హమ్‌షకల్స్’ని భారీ స్థాయిలో ప్రచారం చేసింది ఈ చిత్రబృందం. దాంతో భారీ అంచనాల నడుమ ఈ చిత్రం విడుదలైంది. కానీ, సినిమాకి ఫ్లాప్ టాక్ వచ్చింది. ప్రచారం చేసినంత బ్రహ్మాండంగా సినిమా లేదని ప్రేక్షకులు పెదవి విరిచేశారు.  మళ్లీ తమన్నాకు నిరాశ తప్పలేదు. అయితే.. ఈ సినిమా బాగాలేదనే టాక్ వచ్చినా.. మొదటి మూడు రోజులు వసూళ్లు బాగానే ఉన్నాయట. ఆ విధంగా కొంతలో కొంత ఊరట లభించి ఉంటుంది. తొలి, మలి సినిమాలు ఇలా సక్సెస్‌పరంగా చేదు అనుభవాన్ని మిగిల్చిన నేపథ్యంలో తమన్నా నటించిన మూడో చిత్రం ‘ఇట్స్ ఎంటర్‌టైన్‌మెంట్’ ఆమెకు ఎలాంటి అనుభవాన్ని మిగులుస్తుందో కాలమే చెప్పాలి. ఈ చిత్రం ఆగస్ట్‌లో విడుదల కానుంది.

 

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top