బెంబేలెత్తిపోయిన తమన్నా

Tamanna Clarity on Character in Sye raa Narasimha Reddy - Sakshi

అందాలభామ తమన్నా తన గురించి వైరల్‌ అవుతున్న ఒక వార్త గురిం చి కలవరపడిపోయింది. అది తన ఇమేజ్‌కు సంబంధించిన వార్త కావడమే ఈ అమ్మడికి గుబులు పుట్టించడానికి కారణం. తమన్నాకంటూ ఒక ఇమేజ్‌ ఉందన్నది ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. దశాబ్దంన్నరకు పైగా హీరోయిన్‌గా తన ఇమేజ్‌ను కాపాడుకుంటూ వస్తోంది. ఇన్నేళ్లుగా అందాన్నే గట్టిగా నమ్ముకున్న ఈ మిల్కీబ్యూటీ బాహుబలి చిత్రంతో తన నటనాప్రతిభను చాటు కుంది. ఇలాంటి సమయంలో ఈ బ్యూటీ ప్రస్తుతం నటిస్తున్న చిత్రాలలో సైరా నరసింహారెడ్డి ఒకటి. చిరంజీవి హీరోగా నటిస్తున్న ఇందులో నయనతార హీరోయిన్‌గా నటిస్తోంది. ఇందులో నటి తమన్నా ఒక ముఖ్యపాత్రలో నటిస్తోంది. ఈ చిత్రంలో ఆమెది ప్రతినాయకి పాత్ర అనే ప్రచారం చోరందుకుంది.

దీనికి నటి తమన్నా వెంటనే స్పందించింది. సైరా నరసింహారెడ్డి చిత్రంలో తన పాత్ర గురించి జరుగుతున్న ప్రచారంలో నిజం లేదని స్పష్టం చేసింది. ఈ అమ్మడు కంగారు పడిపోయి వెంటనే స్పందించడానికి కారణం ఉంది. ఇటీవల ఒక ప్రముఖ నటి వైవిధ్యం పేరుతో నెగెటీవ్‌ ఛాయలున్న పాత్రలో నటించి తీవ్ర విమర్శలను ఎదుర్కొంది. అలాంటి పరిస్థితి తనకు రాకూడదనే తమన్నా సైరా నరసింహారెడ్డి చిత్రంలో తన పాత్ర నెగటీవ్‌ పాత్రగా ఉండదని, చాలా ప్రాముఖ్యత కలిగిన పాత్ర అని చెప్పుకొచ్చింది. తాను నెగిటీవ్‌ పాత్రలో నటిస్తున్నట్లు ఎవరు ప్రచారం చేస్తున్నారో తెలియదని, ఏం ఆశించి ఇలాంటి వదంతులు పుట్టిస్తున్నారో అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. ప్రస్తుతం ఈ అమ్మడు తెలుగులో రెండు, తమిళంలో రెండు చిత్రాలు చేస్తూ బిజీగా ఉంది. హిందిలో నటించిన ఖామోషీ చిత్రం ఇటీవల విడుదలై ఆమెను నిరాశ పరిచింది. అలా బాలీవుడ్‌లో హిట్‌ కొట్టాలన్న కల ఇంకా నెరవేరలేదు. అయితే దక్షిణాదిలో మాత్రం తమన్నా మార్కెట్‌కు డోకా లేదు.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top