ఆ హీరో పక్కన మరో చాన్స్ కొట్టేసిందా...! | Taking a step higher with Big B's project, says actress Taapsee | Sakshi
Sakshi News home page

ఆ హీరో పక్కన మరో చాన్స్ కొట్టేసిందా...!

Jan 24 2016 8:04 PM | Updated on Sep 3 2017 4:15 PM

ఆ హీరో పక్కన మరో చాన్స్ కొట్టేసిందా...!

ఆ హీరో పక్కన మరో చాన్స్ కొట్టేసిందా...!

‘ఝమ్మంది నాదం’, తో టాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చిన ముద్దుగుమ్మ తాప్సీ. టాలీవుడ్ ఆమెకు అంతగా కలిసి రాలేదు.

‘ఝమ్మంది నాదం’, తో టాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చిన ముద్దుగుమ్మ తాప్సీ. టాలీవుడ్ ఆమెకు అంతగా కలిసి రాలేదు. సెకండ్ హీరోయిన్ గా ఉన్న మూవీలు మాత్రం ఓ మాదిరిగా విజయాలు సాధించాయి. బాలీవుడ్‌లో మాత్రం ఆమెకు ఆఫర్లు వస్తున్నాయి. అక్షయ్‌కుమార్‌తో నటించిన ‘బేబీ’  ఆమె జాతకాన్నే మార్చేసింది. గ్లామరస్‌ పాత్రల్లో కనిపించే తాప్సీ పోరాట సన్నివేశాల్లోనూ సత్తా చాటతుందని నిరూపించుకుంది. బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన ఈ భామకు అమితాబ్ నటించనున్న ఓ చిత్రంలో అవకాశం కొట్టేసింది. ఐఐఎఫ్ఏ ఫస్ట్ ఎడిషన్ సందర్భంగా హైదరాబాద్ కు విచ్చేసిన తాప్సీ మీడియాతో కాసేపు ముచ్చటించింది. బిగ్ బి సినిమాలో అవకాశం రావడంతో ఆమె సంతోషానికి అవధులు లేకుండా పోయాయని చెప్పింది. తన కెరీర్ లో మరో మెట్టు ఎక్కినట్లు భావిస్తున్నట్లు చెప్పింది.  

తమిళంలో బ్లాక్ బస్టర్ గా నిలిచిన 'కత్తి' మూవీ హిందీ రీమేక్ లో అక్షయ్ కుమార్, తాప్సీలు జంటగా కనిపిస్తారన్న వార్తలు వినిపిస్తున్నాయి. ఈ రీమేక్ మూవీలో అక్షయ్ కుమార్ నరసన నటిస్తున్నారా అని తాప్సీని అడగగా... ఈ ప్రాజెక్టు గురించి అంతగా ఐడియా లేదు. ఏమైనా వివరాలు తెలిస్తే మీకు కచ్చితంగా చెబుతాను అంటూ చమత్కరించింది. చెన్నై వరద బాధితుల సహాయార్థం నిర్వహిస్తున్న కార్యక్రమం అంటూ ఐఐఎఫ్ఏ గురించి చెప్పుకొచ్చింది. బెంగాళీ దర్శకుడు అనిరుధ్ రాయ్ ఈ సినిమాతో బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇస్తున్నాడు. సుజిత్ సర్కార్ నిర్మించే ఈ యాక్షన్ థ్రిల్లర్ కొన్నిరోజుల్లో సెట్స్ మీదకు వెళ్లనుంది.

Advertisement
 
Advertisement
Advertisement