బర్త్‌డే గిఫ్ట్‌గా ఫారెస్ట్‌

Taimur Ali Khan gets a forest as first birthday present - Sakshi

సాక్షి, ముంబయి: పిల్లల బర్త్‌డే అంటే తల్లితండ్రులెవరైనా వారికి ఆట వస్తువులో, బొమ్మలో గిఫ్ట్‌గా ఇస్తారు. బాలీవుడ్‌ స్టార్‌ కపుల్స్‌ కరీనా కపూర్‌, సైఫ్‌ అలీఖాన్‌ మాత్రం తమ చిన్నారి తైమూర్‌కు ఏకంగా పుట్టిన రోజు కానుకగా అడవిని గిఫ్ట్‌గా ఇచ్చేవారు.

ఈనెల 20న తొలి బర్త్‌డే జరుపుకున్న చోటా నవాబ్‌ తైమూర్‌ ఇప్పుడు ఆ అడవికి యజమాని.కరీనాకు డైటీషియన్‌గా వ్యవహరిస్తున్న రిజుత దివేకర్‌ ఈ వివరాలను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేశారు. అత్యంత సన్నిహితులు, కుటుంబ సభ్యుల మధ్య పటౌటీ ప్యాలెస్‌లో తైమూర్‌ బర్త్‌డే వేడుకలు జరిగాయి.

తైమూర్‌ బర్త్‌డే వేడుకలకు సంబంధించిన ఫోటోలు ఇంటర్‌నెట్‌లో వైరల్‌ అవుతూ హల్‌చల్‌ చేశాయి.

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top