ఊహకు అందని పాత్రలో... | Taapsee effect in Gautham Karthik's 'Vai Raja Vai' | Sakshi
Sakshi News home page

ఊహకు అందని పాత్రలో...

Jan 16 2014 12:07 AM | Updated on Aug 13 2018 3:04 PM

ఊహకు అందని పాత్రలో... - Sakshi

ఊహకు అందని పాత్రలో...

గ్లామర్‌ని కాసేపు పక్కన పెట్టేసి ఆర్టిస్టుగా తనేంటో నిరూపించుకునే పనిలో పడ్డారు తాప్సీ. ‘ఆరంభం’తో తమిళంలో కూడా హిట్ కొట్టేసి, అక్కడ కూడా విరివిగా

 గ్లామర్‌ని కాసేపు పక్కన పెట్టేసి ఆర్టిస్టుగా తనేంటో నిరూపించుకునే పనిలో పడ్డారు తాప్సీ. ‘ఆరంభం’తో తమిళంలో కూడా  హిట్ కొట్టేసి, అక్కడ కూడా విరివిగా అవకాశాలను అందిపుచ్చుకుంటున్నారీమె. ప్రస్తుతం లారెన్స్ దర్శకత్వంలో రూపొందుతోన్న ‘గంగ’ చిత్రంలో తాప్సీ నటిస్తున్న చిత్రం తెలిసిందే. ఈ సినిమాలో కూడా అభినయానికి ఆస్కారమున్న పాత్రనే పోషిస్తున్నారు తాప్సీ. ఈ సినిమాతో పాటు మరో క్రేజీ ప్రాజెక్ట్‌కి తాప్సీ పచ్చజెండా ఊపేశారు. ‘3’ చిత్రంతో దక్షిణాది ప్రేక్షకుల ప్రశంసలందుకున్న సూపర్‌స్టార్ రజనీకాంత్ కుమార్తె ఐశ్వర్య ధనుష్ ‘వై రాజా వై’ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు.
 
 గౌతమ్ కార్తీక్, ప్రియా ఆనంద్ జంటగా నటిస్తున్న ఈ చిత్రంలో తాప్సీ ఓ స్పెషల్ రోల్ పోషించనున్నారు. తాప్సీ కెరీర్‌లోనే గుర్తుంచుకోదగ్గదిగా ఈ పాత్ర ఉంటుందని సమాచారం. ‘‘ ‘వై రాజా వై’లో భిన్నమైన పాత్ర చేయబోతున్నాను. ఆడియన్స్ ఊహలకు అందని స్థాయిలో ఇందులో నా పాత్ర ఉంటుంది. ఈ అవకాశాన్నిచ్చిన దర్శకురాలు ఐశ్వర్య ధనుష్‌కి థ్యాంక్స్’ అని ట్విట్టర్ ద్వారా తన ఆనందాన్ని వెలిబుచ్చారు తాప్సీ. యువన్‌శంకర్‌రాజా స్వరాలందిస్తున్న ఈ తమిళ చిత్రం తెలుగు ప్రేక్షకులను కూడా పలకరిస్తుందని ప్రత్యేకించి చెప్పనవసరం లేదు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement