రెండు రోజుల్లోనే 20 లక్ష‌ల‌కి పైగా పెరిగిన ఫాలోవ‌ర్స్

Sushant Singh Rajput  Followers Increased After His Demise - Sakshi

బాలీవుడ్ యంగ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ అకాల‌మ‌ర‌ణం మొత్తం దేశాన్ని క‌దిలించింది. బంధుప్రీతి కార‌ణంగా సుశాంత్ ఆత్మ‌హ‌త్య చేసుకున్నార‌ని అభిమానులు దుమ్మెత్తిపోస్తున్నారు. కొంద‌రి స్వార్థ ప్ర‌యోజ‌నాల వ‌ల్లే సుశాంత్ చ‌నిపోయాడ‌ని సోష‌ల్ మీడియాలో పెద్ద చ‌ర్చ జ‌రుగుతుంది. ఈ నేప‌థ్యంలో సుశాంత్ గురించి మ‌రింత లోతుగా తెలుసుకోవాల‌నుకునే వారి సంఖ్య గ‌ణ‌నీయంగా పెరుగుతోంది. కేవలం రెండు రోజుల్లోనే ఇన్‌స్టాగ్రామ్‌లో 20 ల‌క్ష‌ల మంది సుశాంత్ ప్రొఫైల్‌ను ఫాలో అయ్యారు. ఇంకా ఆ సంఖ్య  పెరుగుతూనే ఉంది.

ప‌లువురు నెటిజ‌న్లు ఆయ‌న పోస్టుల‌పై స్పందిస్తూ.. ‘ఎంతో మంచి భ‌విష్య‌త్తు ఉన్న మీరు ఇంత త్వ‌ర‌గా ఈ లోకాన్ని వ‌దిలిపోవ‌డం బాధాకరం’ అంటూ విచారం వ్య‌క్తం చేస్తున్నారు. ఆదివారం సుశాంత్ సింగ్ బ‌ల‌వ‌న్మ‌ర‌ణానికి పాల్ప‌డిన సంగ‌తి తెలిసిందే. ఇన్‌స్టాగ్రామ్‌లో అప్ప‌టివ‌ర‌కు ఆయ‌న‌కు 9.1 మిలియ‌న్ ఫాలోవ‌ర్లు ఉండ‌గా, కేవ‌లం రెండు రోజుల్లోనే ఆ సంఖ్య 11.5 మిలియ‌న్‌కి చేరింది. సుశాంత్ గురించి మ‌రింత లోతుగా తెలుసుకోవాల‌న్న ఉత్సుక‌త‌తో చాలామంది ఆయ‌నను ఫాలో అవుతున్నారు. ‘చిత్ర పరిశ్రమ నీలాంటి ప్ర‌తిభ క‌లిగిన న‌టుడ్ని కోల్పోయింది’ అంటూ ప‌లువురు హార్ట్ బ్రేక్ సింబ‌ల్స్‌ని పెడుతూ పోస్టులు పెడుతున్నారు. (సుశాంత్‌ ఆత్మహత్య: సల్మాన్‌, కరణ్‌, ఎక్తాలపై కేసు)

ఢిల్లీకి చెందిన మ‌న్వీర పంత్ అనే అభిమాని  మాట్లాడుతూ.. ‘ఎంఎస్ ధోని సినిమా త‌ర్వాత నుంచి నేను సుశాంత్ అభిమానిగా మారాను. అయితే అప్ప‌టికి సోష‌ల్ మీడియాలో ఆయ‌న్ని ఫాలో అవ్వ‌లేదు. సుశాంత్ ఆక‌స్మిక మ‌ర‌ణవార్త విన‌గానే నేను షాక్‌కి గుర‌య్యాను. ఇప్ప‌టికీ దీని నుంచి బ‌య‌ట‌కు రాలేక‌పోతున్నాను. సుశాంత్ సింగ్ గురించి మ‌రింత లోతుగా తెలుసుకోవాల‌న్న ఆస‌క్తితో ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్ వంటి మాధ్య‌మాల్లో ఇప్పుడు ఫాలో అవుతున్నాను. విశ్వం, ఫిజిక్స్, మ్యాథ‌మెటిక్స్ వంటి వాటిలో సుశాంత్‌కి చాలా అవ‌గాహ‌న ఉంది. ప్ర‌తీదాంట్లో చురుగ్గా ఆలోచిస్తూ ఎంతో ప్ర‌తిభ ఉన్న సుశాంత్‌ను బాలీవుడ్ ప‌రిశ్ర‌మ ఎలా వ‌దులుకోగ‌లిగిందో అర్థం కావ‌డం లేద’ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. (నటికి ఆర్థిక సాయం అందించిన అక్షయ్‌ )

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top