ఆమెతో స్క్రీన్‌ పంచుకోవడం హ్యాపీ

Suryakantham Movie Pre Release Event - Sakshi

‘‘నాది బాంబే. లా స్టూడెంట్‌ని. నటనపై ఇష్టంతో సినిమా రంగంలోకి వచ్చాను. కొన్ని యాడ్స్‌తో పాటు, ఫ్రెండ్స్‌ కోసం షార్ట్‌ ఫిల్మ్స్‌లో నటించా. అంతకుమించి నటనలో అనుభవం లేదు. నా తొలి సినిమా ‘సూర్యకాంతం’’ అని పెర్లెన్‌ భేసానియా అన్నారు. రాహుల్‌ విజయ్‌ హీరోగా, నిహారిక కొణిదెల, పెర్లెన్‌ భేసానియా హీరోయిన్లుగా ప్రణీత్‌ బ్రహ్మాండపల్లి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘సూర్యకాంతం’. వరుణ్‌ తేజ్‌ సమర్పణలో నిర్వాణ సినిమాస్‌ బ్యానర్‌పై సందీప్‌ ఎర్రంరెడ్డి, సుజన్‌ ఎరబోలు, రామ్‌ నరేష్‌ నిర్మించిన ఈ సినిమా ఈ నెల 29న విడుదలవుతోంది.

ఈ సందర్భంగా పెర్లెన్‌ భేసానియా మాట్లాడుతూ– ‘‘బాంబేలో నేను మోడలింగ్‌ చేస్తుండగా మేనేజర్‌ద్వారా ‘సూర్యకాంతం’ టీమ్‌ను కలిశాను. ప్రణీత్‌గారు చెప్పిన స్టోరీ నాకు చాలా బాగా నచ్చింది. ఆ తర్వాత ఆడిషన్స్‌ చేశారు. వాళ్లు అనుకున్న పూజ పాత్రకి నేను సరిపోతానని ఎంపిక చేసుకున్నారు. ఈ చిత్రంలో పూజ అనే సెన్సిటివ్‌ గర్ల్‌ పాత్రలో కనిపిస్తా. తను ప్రతి చిన్న విషయానికి తల్లిదండ్రులపై ఆధారపడుతుంటుంది. నా నిజ జీవితానికీ, పూజ పాత్రకి చాలా వ్యత్యాసం ఉంది. రియల్‌ లైఫ్‌లో ఎవరి మీదా ఆధారపడకూడదనే మనస్తత్వం నాది. ఈ సినిమాలో నిహారిక, నా పాత్రలు పూర్తి వ్యతిరేకంగా ఉంటాయి.

ఇద్దరు హీరోయిన్లు ఉన్నారని ట్రయాంగిల్‌ లవ్‌ స్టోరీ అనుకోవద్దు. కథలో భాగంగా మా పాత్రల మధ్య వచ్చే డ్రామాకి సంబంధించిన కథే. ఒక పర్సన్‌గా, ఓ యాక్టర్‌గా నిహారిక చాలా జెన్యూన్‌. తనతో స్క్రీన్‌ షేర్‌ చేసుకోవడం హ్యాపీ. రాహుల్‌ కూడా బాగా ఎంకరేజ్‌ చేశాడు. ప్రస్తుతం మరికొన్ని íసినిమాలకు అవకాశాలు వస్తున్నాయి. ‘సూర్యకాంతం’ విడుదల తర్వాతే ఓ క్లారిటీ వస్తుంది. నటిగా నాకిది మొదటి సినిమా. షూటింగ్‌ ఎక్స్‌పీరియన్స్‌ అద్భుతం. తెలుగు రాకపోయినా టీమ్‌ సహకారంతో మేనేజ్‌ చేయగలిగాను. యాడ్స్, షార్ట్‌ ఫిల్మ్స్‌ చిత్రీకరణకన్నా సినిమా షూటింగ్‌ చాలా భిన్నంగా ఉంటుంది. అయితే ఏదైనా బాగా ఎఫర్ట్‌ పెట్టాలి’’ అన్నారు.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top