రికార్డు స్థాయిలో సినిమా విడుదల! | Suriya's '24' will release in 267 screens in US | Sakshi
Sakshi News home page

రికార్డు స్థాయిలో సినిమా విడుదల!

Apr 28 2016 1:31 PM | Updated on Sep 3 2017 10:58 PM

రికార్డు స్థాయిలో సినిమా విడుదల!

రికార్డు స్థాయిలో సినిమా విడుదల!

ఒక ప్రాంతీయ భాష సినిమాను అమెరికాలో విడుదల చేయాలంటే అందుబాటులో ఉండే స్క్రీన్లు తక్కువ.

ఒక ప్రాంతీయ భాష సినిమాను అమెరికాలో విడుదల చేయాలంటే అందుబాటులో ఉండే స్క్రీన్లు తక్కువ. మరీ ఎక్కువ స్క్రీన్లలో విడుదల చేసినా కష్టమన్న ఉద్దేశంతో నిర్మాతలు ఆగుతారు. కానీ ఇటు తెలుగు, అటు తమిళం రెండు భాషల్లో విడుదలవుతున్న సూర్య కొత్త సినిమా '24'ను మాత్రం.. అమెరికాలో రికార్డు స్థాయిలో ఏకంగా 267 స్క్రీన్లలో విడుదల చేస్తున్నారు. తెలుగు, తమిళ వెర్షన్లు రెండింటినీ 267 స్క్రీన్లలో విడుదల చేస్తున్నామని, మే 5వ తేదీన స్పెషల్ ప్రీమియర్లు వేయాలని కూడా చూస్తున్నామని సినిమా వర్గాలు తెలిపాయి. సినీ గెలాక్సీ ఇంక్ సంస్థ ఈ సినిమాను పంపిణీ చేస్తోంది. ఇదే సంస్థ ఇటీవల తమిళ హీరో విజయ్ నటించిన 'తెరి' సినిమాను కూడా అమెరికాలో పంపిణీ చేసింది.

24 సినిమాలో సూర్య సరసన సమంత, నిత్యామీనన్ నటిస్తున్నారు. టైమ్ మిషన్ కాన్సెప్టు ఆధారంగా ఈ సినిమా నడుస్తుంది. ఈ సినిమాలో సూర్య మూడు పాత్రల్లో నటిస్తున్నాడు. దీనికి ఆస్కార్ అవార్డు విజేత ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తుండగా, సూర్య సొంత బ్యానర్లోనే సినిమాను నిర్మించారు. భారతదేశంలో మే 6వ తేదీన ఈ సినిమా విడుదల కానుంది.

Advertisement
 
Advertisement
Advertisement