కాంబినేషన్ రిపీట్‌? | Vikram Kumar and Vikram K Kumar to team up once again With Suriya | Sakshi
Sakshi News home page

కాంబినేషన్ రిపీట్‌?

May 30 2026 5:53 AM | Updated on May 30 2026 5:53 AM

Vikram Kumar and Vikram K Kumar to team up once again With Suriya

హీరో సూర్య మంచి జోష్‌లో ఉన్నారు. ఆయన హీరోగా నటించిన ‘వీరభద్రుడు’ సినిమా ఇటీవల విడుదలై, సక్సెస్‌ అందుకుంది. తాజాగా సూర్య కథానాయకుడిగా నటించిన ‘విశ్వనాథ్‌ అండ్‌ సన్స్‌’ మూవీ ఆగస్టు 14న రిలీజ్‌కు సిద్ధమైంది. ప్రస్తుతం మలయాళ దర్శకుడు జీతూ మాధవన్  డైరెక్షన్ లో ఓ చిత్రం చేస్తున్నారు సూర్య. ఈ సినిమా వచ్చే సంక్రాంతికి రిలీజ్‌ కానున్నట్లు తెలిసింది. అయితే ఈ చిత్రం తర్వాత తనకు ‘జై భీమ్‌’ వంటి హిట్‌ ఇచ్చిన టీజే జ్ఞానవేల్‌తో మరో సినిమా చేసేందుకు ఆయన రెడీ అవుతున్నారని కోలీవుడ్‌ సమాచారం.

 అలాగే తనకు ‘24’ సినిమాతో మంచి సూపర్‌హిట్‌ ఇచ్చిన విక్రమ్‌ కె. కుమార్‌ డైరెక్షన్ లోనూ ఓ సినిమా చేయనున్నారట సూర్య. విజయ్‌ దేవరకొండ హీరోగా దర్శకుడు విక్రమ్‌ కె.కుమార్‌ ఓ స్పోర్ట్స్‌ డ్రామాను తెరకెక్కించాల్సి ఉంది. దీంతో ముందుగా టీజే జ్ఞానవేల్‌తో సినిమాను సెట్స్‌కు తీసుకెళ్లాలని సూర్య భావిస్తున్నారట. విక్రమ్‌ కె.కుమార్‌తో సూర్య చేయనున్న సినిమా ఆయన కెరీర్‌లో 50వ చిత్రంగా ఉండే అవకాశాలు ఉన్నాయనే టాక్‌ కోలీవుడ్‌లో వినిపిస్తోంది. మరి.. తన 50వ సినిమాను దర్శకుడు విక్రమ్‌ కె.కుమార్‌తోనే సూర్య చేస్తారా? పదేళ్ల తర్వాత వీరి    కాంబినేషన్  రిపీట్‌ అవుతుందా? లెట్స్‌ వెయిట్‌ అండ్‌ సీ. 
 

Advertisement
 
Advertisement
Advertisement