వెంకీ సినిమాలో కోలీవుడ్‌ స్టార్‌ హీరో | Suriya Sepcial Appearance in Venkatesh Next Film | Sakshi
Sakshi News home page

Aug 17 2018 1:14 PM | Updated on Aug 17 2018 1:14 PM

Suriya Sepcial Appearance in Venkatesh Next Film - Sakshi

టాలీవుడ్‌ సీనియర్‌ హీరో వెంకటేష్‌ వరుస సినిమాలతో బిజీ అవుతున్నారు. గురు సినిమా రిలీజ్ తరువాత లాంగ్‌ గ్యాప్‌ తీసుకున్న వెంకీ ప్రస్తుతం వరుసగా సినిమాలు అంగీకరిస్తున్నారు. ప్రస్తుతం అనిల్‌ రావిపూడి దర్శకత్వంలో ఎఫ్‌ 2 ఫన్‌ అండ్‌ ఫ్రస్ట్రేషన్‌ సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమా తరువాత కేయస్‌ రవీంద్ర (బాబీ) దర్శకత్వంలో నాగచైతన్యతో కలిసి వెంకీమామ సినిమా చేయనున్నారు.

వెంకీ మామతో పాటు మరో సినిమా కూడా చేసేలా ప్లాన్‌ చేసుకుంటున్నారు వెంకీ. త్రినాథ్‌ రావు నక్కిన దర్శకత్వంలో ఓ ఎమోషనల్‌ డ్రామాకు ఓకె చెప్పినట్టుగా తెలుస్తోంది. వెంకీ పోలీస్‌ ఆఫీసర్‌గా కనిపిస్తున్న ఈ సినిమాలో తమిళ స్టార్‌ హీరో సూర్య కీలక పాత్రలో నటించనున్నాడట. ఫ్లాష్‌ బ్యాక్‌ ఎపిసోడ్‌లో దాదాపు 20 నిమిషాలు పాటు సూర్య కనిపించనున్నాడట. ప్రస్తుతానికి అధికారిక ప్రకటన లేకపోయినా వెంకటేష్‌ సినిమాలో సూర్య నటించటం కన్ఫామ్‌ అన్న ప్రచారం జరుగుతోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement