సూర్యతో మరోసారి | Suriya gets Nayanthara again? | Sakshi
Sakshi News home page

సూర్యతో మరోసారి

Apr 26 2014 11:51 PM | Updated on Sep 2 2017 6:33 AM

సూర్యతో మరోసారి

సూర్యతో మరోసారి

అదృష్టం ముఖం చాటేయనంత వరకు ఎలాంటి ఆటంకాలు ఏమీ చేయలేవు. ప్రస్తుతం నటి నయనతార పరిస్థితి ఇలానే ఉందని చెప్పక తప్పదు.

 అదృష్టం ముఖం చాటేయనంత వరకు ఎలాంటి ఆటంకాలు ఏమీ చేయలేవు. ప్రస్తుతం నటి నయనతార పరిస్థితి ఇలానే ఉందని చెప్పక తప్పదు. ఈ సంచలన తారను అదృష్టం వెంటాడుతుందని భావించవచ్చు. విమర్శలు, వివాదాలు, వదంతులకు కేంద్రబిందువు ఈ ముద్దుగుమ్మ. శింబు, ప్రభుదేవాలతో ప్రేమ విఫలం తరువాత హీరోయిన్‌గా సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించిన నయనతార రాజారాణి, ఆరంభం, ఇదు కదిర్‌వేలన్ కాదల్ అంటూ వరుస విజయాలను సొంతం చేసుకున్నారు. అదే విధంగా మళ్లీ మాజీ ప్రియుడు శింబు సరసన ఇదు నమ్మాళ్ చిత్రంలో నటిస్తూ మరోసారి సంచలన నటినని రుజువు చేసుకున్నారు.
 
 ఇదు కదిర్ వేలన్ కాదల్ చిత్రం తరువాత ఉదయనిధి స్టాలిన్‌తో వెంటనే నన్భేండా చిత్రంలో రొమాన్స్ చేస్తున్నారు. తాజాగా సూర్యతో నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. ఈ జంట ఇంతకు ముందు ఆదవన్ చిత్రంలో నటించి హిట్ పెయిర్‌గా గుర్తింపు పొందారు. చాలా గ్యాప్ తరువాత మళ్లీ ఇప్పుడు కలసి నటించడానికి సిద్ధం అవుతున్నారు. ఈ క్రేజీ జంట నటించనున్న చిత్రానికి వెంకట్ ప్రభు దర్శకత్వం వహించనున్నారు. ప్రస్తుతం సూర్య లింగుస్వామి దర్శకత్వంలో అంజాన్ చిత్రం చేస్తున్నారు. ఈ చిత్రం పూర్తి అయిన తరువాత నయనతారతో జతకట్టే చిత్రంలో నటించనున్నారు.  
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement