రాక్షస రాజుగా రానానే ఫిక్స్‌

Suresh Production To Produce Guna Sekhar Hiranya Kashipa - Sakshi

రుద్రమదేవి సినిమా తరువాత లాంగ్‌ గ్యాప్‌ తీసుకున్న దర్శకుడు గుణశేఖర్‌, ఈ సారి పౌరాణిక కథ మీద వర్క్‌ చేస్తున్నారు. మహా భక్తుడు ప్రహ్లాదుడి కథను హిరణ్య కశిపుడి కోణంలో రూపొందించేందుకు రెడీ అవుతున్నాడు. అయితే ఈ సినిమాపై చాలా కాలంగా వార్తలు వినిపిస్తున్నా ఇంత వరకు అధికారిక ప్రకటన మాత్రం రాలేదు. తాజా ఈ సినిమాపై సురేష్‌ బాబు క్లారిటీ ఇచ్చారు.

గుణశేఖర్‌, రానా కాంబినేషన్‌లో హిరణ్య చిత్రం రూపొందుతుందని వెల్లడించారు. ఈ సినిమా సురేష్‌ ప్రొడక్షన్స్‌ బ్యానర్‌లోనే భారీ బడ్జెట్‌తో రూపొందుతుందని తెలిపారు. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన ఆర్ట్‌ వర్క్‌ జరుగుతుందని చెప్పిన సురేష్‌, సినిమా ఎప్పుడు సెట్స్‌మీదకు వెళుతుందన్న విషయం ఇప్పుడు చెప్పలేమన్నారు.

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top