‘సైరా’కు ఆత్మ అదే : సురేందర్‌ రెడ్డి

Surender Reddy Announced That Sye Raa DTS Mixing Work Completed - Sakshi

మెగాస్టార్‌ చిరంజీవి తొలి స్వతంత్ర్య సమరయోధుడి పాత్రలో నటిస్తున్న సైరాను అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించారు. అన్ని కార్యక్రమాలను పూర్తిచేసుకున్న ఈ మూవీని భారీ ఎత్తున రిలీజ్‌ చేసేందుకు రంగం సిద్దం చేశారు. విడుదల తేదీ దగ్గర పడుతున్న కొద్దీ.. ప్రమోషన్‌ కార్యక్రమాల జోరును పెంచింది చిత్రబృందం.

సినిమాకు సంగీతం, నేపథ్య​ సంగీతం ఎంత ముఖ్యమో అందరికీ తెలిసిందే. సన్నివేశాల్లోని భావాలను మరింత పెంచేందుకు బ్యాగ్రౌండ్‌ స్కోర్‌ దోహదపడుతుంది. దాదాపు 250 కోట్లతో తెరకెక్కిన సైరాలో బ్యాగ్రౌండ్‌ స్కోర్‌ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుందని, అదే సైరాకు ఆత్మ అని, దీంతో సైరా మరో లెవల్‌కు వెళ్తుందని దర్శకుడు సురేందర్‌ రెడ్డి తెలిపాడు. తాజాగా ఈ మూవీ డీటీఎస్‌ మిక్సింగ్‌ పూర్తయిందని పేర్కొన్నాడు. ఈ సినిమాలో బాలీవుడ్‌ మెగాస్టార్‌ అమితాబ్‌ బచ్చన్‌, విజయ్‌ సేతుపతి, కిచ్చా సుదీప్‌, జగపతి బాబు, నయనతార, తమన్నా కీలక పాత్రల్లో నటిస్తున్నారు. అక్టోబర్‌ 2న ఈ మూవీ విడుదల కానుంది.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top