మైండ్‌ గేమ్‌

Super Sketch movie rerelease - Sakshi

‘‘ఈ రోజుల్లో సినిమాలు ఒకసారి రిలీజ్‌ కావడమే కష్టంగా ఉంది. అలాంటిది ‘సూపర్‌ స్కెచ్‌’ చిత్రాన్ని రీ–రిలీజ్‌ చేస్తున్నాం. సినిమాపై మాకు ఉన్న నమ్మకమే ఇందుకు కారణం’’ అన్నారు నటుడు ఇంద్ర. నర్సింగ్, ఇంద్ర, సమీర్‌ దత్తా, కార్తీక్, చక్రి, మాగంటి ముఖ్య పాత్రల్లో రవి చావలి దర్శకత్వంలో తెరకెక్కిన ‘సూపర్‌ స్కెచ్‌’ సినిమాని ఇవాళ రీ–రిలీజ్‌ చేస్తున్నారు. ఈ సినిమాలో విలన్‌ పాత్ర పోషించిన ఇంద్ర మాట్లాడుతూ– ‘‘నేను కరాటే ప్రొఫెషనల్‌ని. వారియర్‌ కరాటే ఇంటర్న్‌షనల్‌ ఫౌండేషన్‌ ద్వారా కరాటే శిక్షణ ఇస్తున్నాం.

సినిమాలపై ఆసక్తితో ఇండస్ట్రీకి వచ్చా. మొదట్లో ఇబ్బందులు పడ్డా. ‘సై, సైనికుడు, ధృవ, శ్రీమన్నారాయణ’ వంటి సినిమాల్లో నటించాను. సోలో హీరోగా ‘పుత్రుడు, కుర్‌ కురే’ సినిమాలు చేశా. ‘సూపర్‌ స్కెచ్‌’ సినిమాలో విలన్‌గా నటించాను. మైండ్‌ గేమ్‌ బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కిన చిత్రమిది. ఆద్యంతం ఉత్కంఠభరితంగా ఉంటుంది. ఈ సినిమా నటుడిగా పూర్తి సంతృప్తినిచ్చింది. ప్రస్తుతం ‘సైరా’ సినిమాలో ఓ పాత్ర చేస్తున్నా’’ అన్నారు.

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top