డైప‌ర్‌ను మాస్కుగా వాడిన స‌న్నీలియోన్‌ | Sunny Leone Wear Diaper As A Face Mask | Sakshi
Sakshi News home page

క్రేజీ స‌న్నీ: ‌డైప‌ర్‌తో ఫేస్‌ మాస్కు

Apr 17 2020 9:38 AM | Updated on Apr 17 2020 9:58 AM

Sunny Leone Wear Diaper As A Face Mask - Sakshi

ఇంట్లో నుంచి బ‌య‌ట అడుగుపెట్టే స‌మ‌యంలో మాస్క్ త‌ప్ప‌నిస‌రి. మ‌రి ప్ర‌తి ఒక్క‌రి ద‌గ్గ‌రా మాస్కులు ఉన్నాయా అంటే నిశ్శ‌బ్ధ‌మే రాజ్య‌మేలుతుంది. అత్య‌వ‌స‌ర ప‌ని ప‌డిన‌ప్పుడు ముఖానికి ఏం క‌ట్టుకుని వెళ‌తారు? మాస్కు ఉంటే స‌రి, లేక‌పోతే క‌ర్చీఫ్‌, దుప‌ట్టా, స్కార్ఫ్ ఇలా మిగ‌తా దారుల‌ను చూసుకుంటాం. కానీ వీటితోపాటు మ‌రో వ‌స్తువు కూడా ఎమ‌ర్జెన్సీ మాస్క్‌గా ఉప‌యోగ‌ప‌డుతుందంటోంది బాలీవుడ్ హాట్ స్టార్ సన్నీలియోన్‌. మొద‌ట్లో త‌న పిల్ల‌ల‌కు మాస్కు క‌ట్ట‌డానికి ఎంతో బాధ‌ప‌డిన ఈ భామ ఇప్పుడు వాటితోనే ఎన్నో ప్ర‌యోగాలు చేస్తూ అభిమానుల‌ను ఎంట‌ర్‌టైన్ చేస్తోంది. (తిరుగులేని సన్నీలియోన్‌, మళ్లీ..)

ఎలాంటి క‌ష్టం లేకుండా కూచున్న చోటే కొంగొత్త మాస్కుల‌ను మాస్కు సిద్ధం చేసుకోవ‌చ్చని సెల‌విస్తోంది. ఈ మేర‌కు ఇన్‌స్టాగ్రామ్‌లో డైప‌ర్ల‌ను ముఖానికి ధ‌రించిన ఫొటోల‌ను అభిమానుల‌తో పంచుకుంది. ఇలా అత్య‌వ‌స‌ర ప‌రిస్థితుల్లో డైప‌ర్‌ను ఎమ‌ర్జెన్సీ ఫేస్‌మాస్క్‌గా వాడుకోండని స‌ల‌హా ఇచ్చింది. ముఖానికి ఓసారి స్కార్ఫ్ క‌ట్టుకోగా, మ‌రోసారి బాక్సింగ్ గ్ల‌వ్స్‌ను ధ‌రించింది. చిన్న‌పిల్ల‌ల ఆట‌బొమ్మ‌ల‌ను కూడా వ‌దిలిపెట్ట‌కుండా సింహం బొమ్మను ముఖానికి క‌ట్టుకున్న‌ ఫొటోను సైతం షేర్ చేసింది. సన్నీ క్రేజీ ఆలోచ‌న‌ల‌కు అభిమానులు ఫ‌న్నీ కామెంట్లు పెడుతున్నారు. (కరోనా: మాస్క్‌ పెట్టుకోలేదని లేదని కేసు)

Advertisement
 
Advertisement
Advertisement