ఆ వార్తల్లో నిజం లేదన్న సన్నీ లియోన్ | Sakshi
Sakshi News home page

ఆ వార్తల్లో నిజం లేదన్న సన్నీ లియోన్

Published Fri, Dec 4 2015 12:21 PM

ఆ వార్తల్లో నిజం లేదన్న సన్నీ లియోన్

ముంబై: బాలీవుడ్ నటి సన్నీ లియోన్ తనపై వస్తున్న వదంతులపై మండిపడింది. ప్రముఖ దర్శకుడు కరణ్ జోహార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'ఎ దిల్ హై ముష్కిల్' చిత్రంలో సన్నీ లియోన్ ప్రత్యేక పాత్రలో నటిస్తున్నట్లు ఇటీవల వార్తలు వచ్చాయి. ఐశ్వర్య రాయ్, అనుష్క శర్మ, రణ్బీర్ కపూర్ నటిస్తున్న ఈ రొమాంటిక్ డ్రామాలో సన్నీ అవకాశాన్ని కొట్టేసిందని సినీజనాలు మాట్లాడుకుంటున్న విషయాన్ని శుక్రవారం మీడియా ఆమె వద్ద ప్రస్తావించగా.. అవన్నీ వట్టి వదంతులేనని కొట్టిపారేసింది. అలాగే సోహైల్ ఖాన్ చిత్రంలో నవాజుద్దిన్ సిద్దఖీ సరసన నటిస్తున్నట్లు వచ్చిన కథనాలను సైతం సన్నీ లియోన్ ఖండించింది.

'జనాలు ఆసక్తికరంగా ఉండే వార్తలను తయారుచేయడంలో భాగంగా ఇలా మాట్లాడుతున్నారు, ఇలాంటి విషయాలు ఏమైనా ఉంటే ట్విట్టర్ ద్వారా నేనే తెలియజేస్తాను' అని తెలిపింది. తన సొంత ప్రొడక్షన్ హౌస్ డెవలప్ చేసిన ఓ సూపర్ హీరో కాన్సెప్ట్ అద్భుతంగా ఉందని తెలిపిన సన్నీ.. భవిష్యత్తులో దీనికి సంబంధించి మరింత స్పష్టత వస్తుందని తెలిపింది. సన్నీలియోన్ నటించిన 'మస్తీజాదే' చిత్రం జనవరి 29న ప్రేక్షకుల ముందుకు రానుంది.

 
Advertisement
 
Advertisement