కన‍్ఫమ్‌ : ఏఎన్నార్‌గా సుమంత్‌

Sumanth As ANR In NTR Biopic - Sakshi

నందమూరి బాలకృష్ణ ప్రధాన పాత్రలో క్రిష్ దర్శకత్వంలో ఎన్టీఆర్‌ బయోపిక్‌ తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఒక షెడ్యూల్‌ షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా ఇంకా నటీనటుల ఎంపిక జరుగుతోంది. తాజాగా ఇద్దరు యువ కథా నాయకులు ఎన్టీఆర్‌లో భాగమవుతున్నట్టుగా ప్రకటంచారు. ఇప్పటికే రానా.. ఎన్టీఆర్‌ కోసం పనిచేస్తున్నట్టుగా ప్రకటించగా తాజా సుమంత్ కూడా ఈ ప్రెస్టీజియస్‌ ప్రాజెక్ట్‌లో భాగమవుతున్నట్టుగా కన్ఫమ్‌ చేశాడు.

రానా ట్వీట్‌ ను రీట్వీట్ చేస్తూ తాను కూడా ఎన్టీఆర్‌లో నటిస్తున్నట్టుగా క్లారిటీ ఇచ్చారు. ముందు నుంచి అనుకుంటున్నట్టుగానే తాత ఏఎన్నార్‌ పాత్రలో నటించేందుకు ఓకె చెప్పాడు సుమంత్‌. గతంలో ఈ పాత్రను నాగచైతన్య పోషిస్తున్నట్టుగా వార్తలు వచ్చాయి. అయితే రూమర్స్‌ కు చెక్ పెడుతూ ఎన్టీఆర్‌ లో ఏఎన్నార్‌గా కనిపించబోయేది తానే అంటూ క్లారిటీ ఇచ్చేశాడు సుమంత్‌.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top