సుకుమార్ 'దర్శకుడు' ఫస్ట్ లుక్ | Sukumar Darsakudu Movie First Look | Sakshi
Sakshi News home page

సుకుమార్ 'దర్శకుడు' ఫస్ట్ లుక్

Apr 16 2017 2:34 PM | Updated on Sep 5 2017 8:56 AM

సుకుమార్ 'దర్శకుడు' ఫస్ట్ లుక్

సుకుమార్ 'దర్శకుడు' ఫస్ట్ లుక్

దర్శకుడిగానే కాక నిర్మాతగానూ తన మార్క్ చూపించిన స్టార్ డైరెక్టర్ సుకుమార్ తన నిర్మాణంలో మరో సినిమాను

దర్శకుడిగానే కాక నిర్మాతగానూ తన మార్క్ చూపించిన స్టార్ డైరెక్టర్ సుకుమార్ తన నిర్మాణంలో మరో సినిమాను రూపొందిస్తున్నాడు. తన అన్న కొడుకు అశోక్ను హీరోగా పరిచయం చేస్తూ తెరకెక్కిస్తున్న ఈ సినిమాతో హరి ప్రసాద్ దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. ఈ సినిమాకు సుకుమార్ కేవలం నిర్మాతగానే వ్యవహరిస్తున్నాడు. కథ, కథనం, డైలాగ్స్ అన్ని హరి ప్రసాద్ స్వయంగా తయారు చేసుకున్నాడు.

ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ను సుకుమార్ తన పేస్ బుక్ పేజ్లో రిలీజ్ చేశాడు. సుకుమార్ క్రియేటివ్ వర్క్లో పాలు పంచుకోకపోయినా.. పోస్టర్లో సుకుమార్ స్టైల్ స్పష్టంగా కనిపిస్తోంది. సాయి కార్తీక్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాలో ఈషా హీరోయిన్గా నటిస్తోంది. త్వరలోనే టీజర్ పాటు రిలీజ్ డేట్ను కూడా ప్రకటించనున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement