గౌరవంగా ఫీలవుతున్నా | Sudeep selfie with mega star chiranjeevi in sye raa shooting | Sakshi
Sakshi News home page

గౌరవంగా ఫీలవుతున్నా

Oct 17 2018 12:33 AM | Updated on Oct 17 2018 12:33 AM

Sudeep selfie with mega star chiranjeevi in sye raa shooting - Sakshi

స్వాతంత్య్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవితం ఆధారంగా చిరంజీవి హీరోగా సురేందర్‌ రెడ్డి దర్శకత్వంలో రామ్‌చరణ్‌ నిర్మిస్తున్న సినిమా ‘సైరా: నరసింహారెడ్డి’. ఈ సినిమా తాజా షెడ్యూల్‌ జార్జియాలో జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ టైమ్‌లోనే చిరంజీవితో కలిసి ఫొటోకు ఫోజు ఇచ్చారు సుదీప్‌. ‘‘లెజండ్‌ చిరంజీవిగారితో స్క్రీన్‌ను షేర్‌ చేసుకోవడం ఆనందంగా ఉంది.

గౌరవంగా ఫీలవుతున్నాను. జార్జియా షెడ్యూల్‌లో నా షూటింగ్‌ పూర్తయింది. నేను నటించిన ‘ది విలన్‌’ సినిమా రేపు విడుదల అవుతోంది. ‘బిగ్‌బాస్‌’ కొత్త సీజన్‌ స్టార్ట్‌ కాబోతుంది. ఈ వీకెండ్‌ ఎగై్జటింగ్‌గా ఉంది’’ అని పేర్కొన్నారు సుదీప్‌. ‘సైరా’ వచ్చే ఏడాది వేసవిలో విడుదల కానుంది. ఈ సినిమా కాకుండా ‘కోటిగొబ్బ–3’, ‘పహిల్వాన్‌’ సినిమాలు కూడా సుదీప్‌ చేతిలో ఉన్నాయి. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement